- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిన్నారి పునర్విక దాతలకు అలర్ట్.. ఇకపై నిధులు పంపవద్దని తండ్రి రిక్వెస్ట్
కర్నూలు చిన్నారి పునర్విక SMA చికిత్స కోసం ₹16 కోట్ల విరాళాలు సమకూరాయి. నిధులు పూర్తయినందున ఇకపై ఎవరూ డబ్బులు పంపవద్దని పాప తండ్రి అలెర్ట్ జారీ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లాకు చెందిన చిన్నారి పునర్విక (Punarvika)ను రక్షించేందుకు యావత్ మానవ సమాజం ఏకమైంది. సోషల్ మీడియా వేదికగా అనేక మంది చిన్నారి చికిత్స కోసం విరాళాలు సేకరించటం ప్రారంభించారు. పేద కుటుంబానికి చెందిన చిన్నారిని కాపాడాలనే సోషల్ మీడియా ప్రయత్నం విజయవంతంగా ముగిసింది. అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA) వ్యాధితో బాధపడుతున్న పునర్వికకు అత్యంత ఖరీదైన ₹16 కోట్ల విలువైన జోల్జెన్స్‌మా ఇంజెక్షన్ (Zolgensma injection) అవసరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా జరిగిన ప్రచారానికి వేలాది మంది దాతలు స్పందించారు. కేవలం కొద్ది రోజుల్లోనే చికిత్సకు కావాల్సిన పూర్తి మొత్తం సమకూరింది. దీంతో ఇకపై దాతలు ఎవరు పునర్విక ఖాతాకు డబ్బులు పంపవద్దని పాప తండ్రి కోరారు.
అవసరమైన నిధులు అందడంతో చిన్నారి తండ్రి ఒక కృతజ్ఞతా వీడియోను విడుదల చేశారు. "మా పాప ప్రాణాలను కాపాడేందుకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. మీ దాతృత్వంతో ₹16 కోట్లు సమకూరాయి, ఇకపై ఎవరూ విరాళాలు పంపవద్దు" అని ఆయన విజ్ఞప్తి చేశారు. మానవత్వం చాటుకున్న దాతలకు నెటిజన్లు నీరాజనాలు పలుకుతున్నారు. త్వరలోనే చిన్నారికి ఈ ఇంజెక్షన్ ఇచ్చి ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.
దయచేసి సహాయం అందించి ప్రాణాన్ని కాపాడండి.. మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్






