- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దయచేసి సహాయం అందించి ప్రాణాన్ని కాపాడండి.. మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్
దయచేసి జోక్యం చేసుకుని ఈ బిడ్డకు తక్షణ సహాయం అందించండి.

దిశ, సినిమా: కర్నూలు జిల్లాకు చెందిన చిన్నారి పునర్విక(punarvika)ను కాపాడుకునేందుకు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న పోరాటం అందరినీ కదిలిస్తోంది. కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన సురేష్ కుమార్, పుష్పావతిల కుమార్తె పునర్విక ప్రాణం నిలబడాలంటే ఏకంగా రూ. 16 కోట్ల విలువైన ఇంజెక్షన్ అవసరమని వైద్యులు తేల్చి చెప్పారు. ఇంత భారీ మొత్తాన్ని సమకూర్చడం ఆ పేద కుటుంబానికి అసాధ్యమైన పని. అయితే, సోషల్ మీడియా ద్వారా ఈ విషయం వెలుగులోకి రావడంతో దాతలు ముందుకు వచ్చి ఇప్పటివరకు దాదాపు రూ. 8 కోట్లు సేకరించినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ అంశంపై టాలీవుడ్ నటుడు మంచు మనోజ్(Manchu Manoj) స్పందిస్తూ చేసిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పరిస్థితిపై మనోజ్ స్పందిస్తూ.. ‘‘ఈ వార్త నన్ను పూర్తిగా కలిచివేసింది.
ఒక చిన్నారి ప్రాణం నిలవడానికి 16 కోట్లు కావాలా?.. ఇక్కడ నాకు ఊరటనిచ్చే విషయం ఏంటంటే.. సామాన్య ప్రజలు, అపరిచితులు కలిసి ఇప్పటికే కోట్లలో నిధులు సేకరించారు. సమయం చాలా తక్కువగా ఉంది. అందుకే నేను PMO India, Telangana CMO లను విజ్ఞప్తి చేస్తున్నాను.. దయచేసి జోక్యం చేసుకుని ఈ బిడ్డకు తక్షణ సహాయం అందించండి’’ అని కోరారు. అంతేకాకుండా చిన్నారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మనోజ్ ఒక ముఖ్యమైన సూచన చేశారు. ‘‘పాప పరిస్థితి చాలా సున్నితంగా ఉంది. ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉన్నందున దయచేసి ఆమెను నేరుగా కలవడానికి ప్రయత్నించకండి. మీ ప్రార్థనలు, విరాళాలు మాత్రమే ఇప్పుడు ఆమెకు ప్రాణవాయువు. ఈ పోరాటంలో ఆ చిన్నారి గెలిస్తే మనమందరం గెలిచినట్టే’’ అని రాసుకొచ్చారు. ఎప్పుడూ సేవా కార్యక్రమాల్లో ముందుండే మంచు మనోజ్, ఈ క్లిష్ట సమయంలో పునర్విక కోసం గొంతు ఎత్తడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.






