పబ్లిక్‌లో హీరోయిన్‌ పట్ల నిర్మాత అసభ్య ప్రవర్తన.. ఇబ్బందిగా ఫీలవుతున్నా వదలకుండా..

by Gantepaka Srikanth |   (  Updated:2026-01-07 04:58:31  IST  )

బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ మరోసారి వివాదంలో పడ్డారు. పబ్లిక్‌ ఫంక్షన్‌లో హీరోయిన్ అనన్య పాండే పట్ల అసభ్యంగా ప్రవర్తించారు.

పబ్లిక్‌లో హీరోయిన్‌ పట్ల నిర్మాత అసభ్య ప్రవర్తన.. ఇబ్బందిగా ఫీలవుతున్నా వదలకుండా..
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్(Karan Johar) మరోసారి వివాదంలో పడ్డారు. పబ్లిక్‌ ఫంక్షన్‌లో హీరోయిన్ అనన్య పాండే(Ananya Panday) పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. వివరాల్లోకి వెళితే.. హీరో కార్తీక్ ఆర్యన్(Kartik Aaryan), అనన్య పాండే జంటగా నటించిన ‘తూ మేరీ మైన్ తేరా మైన్ తేరా తూ మేరీ’ సినిమాకు కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా ఇటీవల ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్‌మీట్‌లో వేదికపైనే హీరోయిన్ అనన్య పాండే నడుము మీద చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించారు. అనన్య అసౌకర్యంగా ఫీలైనట్లు ఆమె మొహంలో కనిపించినా కూడా వదలకుండా అలాగే ప్రవర్తించారు. ఈ సమయంలో హీరో కార్తీక్ ఆర్యన్ కూడా పక్కనే ఉండటం గమనార్హం. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కరణ్ జోహార్‌పై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. పబ్లిక్ ఈవెంట్స్‌లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. బాలీవుడ్ అగ్రహీరోలు అందరితోనూ సినిమాలు తీసిన కరణ్.. ఇటీవల అనారోగ్యంతో కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్నారు. చాలా రోజుల తర్వాత నిర్మాతగా రీఎంట్రీ ఇస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

Read More..

విజయ్ దేవరకొండ హీరోయిన్‌కు చేదు అనుభవం.. స్టేజీపైనే ప్రైవేట్ పార్ట్స్‌పై చెయ్యి వేసి నలిపేసిన డైరెక్టర్(వీడియో)

Next Story