విజయ్ దేవరకొండ హీరోయిన్‌కు చేదు అనుభవం.. స్టేజీపైనే ప్రైవేట్ పార్ట్స్‌పై చెయ్యి వేసి నలిపేసిన డైరెక్టర్(వీడియో)

by I. Sairam |   (  Updated:2026-01-05 08:24:01  IST  )

‘లైగర్’(Liger) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే(ananya Pandey) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

విజయ్ దేవరకొండ హీరోయిన్‌కు చేదు అనుభవం.. స్టేజీపైనే ప్రైవేట్ పార్ట్స్‌పై చెయ్యి వేసి నలిపేసిన డైరెక్టర్(వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ‘లైగర్’(Liger) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే(ananya Pandey) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ సినిమానే బోల్తా పడటంతో ఈ చిన్నదానికి అవకాశాలు ఇక్కడ అవకాశాలు తగ్గిపోయాయి. కానీ బాలీవుడ్‌లో మాత్రం వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది. అయితే ఈ చిన్నది మళ్లీ టాలీవుడ్ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వరుస పరాజయాల తర్వాత అఖిల్ అక్కినేని గట్టిగా కమ్‌బ్యాక్ ఇవ్వాలనే ఆశతో ‘లెనిన్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పక్కా మాస్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది.

అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఓ స్పెషల్ సాంగ్‌లో అనన్య పాండే చిందులేయనున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ ముద్దుగుమ్మకు ఈ సినిమాలో ఓ చిన్న అతిథి పాత్ర కూడా ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా అనన్య పాండేకు చేదు అనుభవం కలిగిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే.. కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘తూ మేరీ మై తేరా మై తేరా తూ మేరీ’ సినిమా ప్రమోషన్లలో భాగంగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

అయితే ఈ ఈవెంట్‌కు బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్ కూడా వచ్చాడు. ఈ క్రమంలో ఈ ముగ్గురు స్టేజీపై ఫొటో తీసుకుంటున్న క్రమంలో కరణ్ జోహార్ అనన్య పాండే చెస్ట్ పై హ్యాండ్ వేసి గట్టిగా ప్రెస్ చేస్తున్నాడు. దీంతో అన్‌కంఫర్ట్‌గా ఫీల్ అయిన అనన్య ఫేస్‌ అంతా చికాకుగా పెట్టింది. ఇక అది చూసిన డైరెక్టర్ అప్పుడు అక్కడి నుంచి తన చేతిని తీసేస్తాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. దీన్ని చూసిన నెటిజన్లు ఛీఛీ ఇదేం పాడు పని అంటూ డైరెక్టర్‌ను తిట్టిపోస్తున్నారు.

Read More..

ఇట‌లీ టూర్ ఫినీష్‌..ఎయిర్ పోర్టులో మెరిసిన విజ‌య్-ర‌ష్మిక జంట‌ !

Next Story