ఇట‌లీ టూర్ ఫినీష్‌..ఎయిర్ పోర్టులో మెరిసిన విజ‌య్-ర‌ష్మిక జంట‌ !

by velandi.Saikiran |   (  Updated:2026-01-05 08:28:50  IST  )

కొత్త సంవత్సరం నేపథ్యంలో విజయ్ దేవరకొండ-రష్మిక జంట ఇటలీకి వెకేషన్ లో భాగంగా వెళ్లారట. దాదాపు వారం రోజుల పాటు అక్కడ ఎంజాయ్ చేసి, ఇవాళ హైదరాబాద్ వచ్చినట్టు చర్చ జరుగుతోంది.

ఇట‌లీ టూర్ ఫినీష్‌..ఎయిర్ పోర్టులో మెరిసిన విజ‌య్-ర‌ష్మిక జంట‌ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ అగ్ర హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక ఇద్దరు మరోసారి విమానాశ్రయంలో మెరిశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో వీళ్లు కనిపించిన వీడియో వైరల్ గా మారింది. కొత్త సంవత్సరం నేపథ్యంలో విజయ్ దేవరకొండ-రష్మిక జంట ఇటలీకి వెకేషన్ లో భాగంగా వెళ్లారట. దాదాపు వారం రోజుల పాటు అక్కడ ఎంజాయ్ చేసి, ఇవాళ హైదరాబాద్ వచ్చినట్టు చర్చ జరుగుతోంది.

దానికి తగ్గట్టుగానే ఇద్దరు కలిసి విమానాశ్రయంలో ఒకే కారులో వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా గీత గోవిందం సినిమా నుంచి ఈ జంట ప్రేమలో ఉన్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. గత ఏడాది సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారట. ఈ ఏడాది చివరలో లేదా వేసవిలో పెళ్లి కూడా జరగనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటివరకు అధికారికంగా ఈ ఇద్దరు ఎక్కడా ప్రకటించలేదు.

Read More..

విజయ్ దేవరకొండ హీరోయిన్‌కు చేదు అనుభవం.. స్టేజీపైనే ప్రైవేట్ పార్ట్స్‌పై చెయ్యి వేసి నలిపేసిన డైరెక్టర్(వీడియో)

Next Story