హీరోయిన్ల మీద కోట్లు పెట్టడానికి నిర్మాతలు భయపడుతున్నారు.. మాళవిక సెన్సేషనల్ కామెంట్స్!

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-21 05:32:18  IST  )

కోలీవుడ్ యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్ (Malavika Mohanan)కెరీర్ ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉంది.

హీరోయిన్ల మీద కోట్లు పెట్టడానికి నిర్మాతలు భయపడుతున్నారు.. మాళవిక సెన్సేషనల్ కామెంట్స్!
X

దిశ, సినిమా: కోలీవుడ్ యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్ (Malavika Mohanan)కెరీర్ ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉంది. తెలుగు, తమిళ సినిమాల్లో వరుస అవకాశాలు అందుకుంటూ గ్లామర్‌తో పాటు నటనకూ ప్రాధాన్యం ఇస్తోంది. గతేడాది మోహన్‌లాల్ సరసన నటించిన ‘హృదయపూర్వం’ సూపర్ హిట్ కావడంతో ఆమె క్రేజ్ అమాంతం పెరిగింది. ఆ జోష్‌లో భాగంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘ది రాజా సాబ్’(The Raja Saab)లో కీలక పాత్ర పోషించినప్పటికీ, సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌తో ఆశించిన ఫలితం సాధించలేకపోయింది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాళవిక మోహనన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘మన దగ్గర భారీ బడ్జెట్ సినిమాలంటే కేవలం హీరోలవే ఎందుకు ఉంటున్నాయి? హీరోయిన్ మెయిన్ రోల్‌లో ఉంటే కోట్లు పెట్టడానికి నిర్మాతలు భయపడుతున్నారు?" అని మాళవిక ప్రశ్నించింది.

చాలా మంది ప్రొడ్యూసర్లు, హీరోలు.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి బాక్సాఫీస్ దగ్గర అంత సీన్ ఉండదని, అందుకే ఒక లిమిట్ దాటి ఖర్చు చేయకూడదని అనుకుంటారని తెలిపింది. మలయాళ సినిమా సక్సెస్‌ను చూపిస్తూ.. నిర్మాతలు ధైర్యం చేసి కంటెంట్‌ను నమ్మితే ఏదైనా సాధ్యమేనని చెప్పడానికి మలయాళ మూవీ ‘లోకా:చాప్టర్1చంద్ర’(Lokah: Chapter 1 Chandra) ను ఉదాహరణగా చెప్పింది. కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా వచ్చిన ఆ సినిమాకు దుల్కర్ సల్మాన్ భారీగా ఖర్చు చేశారని, రిజల్ట్ చూస్తే ఏకంగా 300 కోట్లు వసూలు చేసిందని గుర్తు చేసింది. ప్రొడ్యూసర్లు దుల్కర్‌లా నమ్మి అవకాశం ఇస్తే హీరోయిన్లు కూడా బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తారు’’ అని మాళవిక చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట సంచలనం సృష్టిస్తున్నాయి.

Read More..

న్యూ బిగినింగ్ అంటూ మృణాల్ షాకింగ్ పోస్ట్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు


Next Story