- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
న్యూ బిగినింగ్ అంటూ మృణాల్ షాకింగ్ పోస్ట్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)పేరు గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

దిశ, సినిమా: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)పేరు గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సినిమాల పరంగానే కాకుండా, ఆమె వ్యక్తిగత జీవితం చుట్టూ వస్తున్న వార్తలు కూడా నెట్టింట చర్చకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌తో ఆమె ప్రేమలో ఉందన్న పుకార్లు గత కొద్దిరోజులుగా జోరుగా వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే రోజున వీరిద్దరూ పెళ్లితో ఒక్కటి కాబోతున్నారంటూ కూడా ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయాలపై మృణాల్ కానీ, ధనుష్(Dhanush) కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడంతో.. ఈ వార్తలు మరింత పెరుగుతున్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా మృణాల్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ప్రస్తుతం తాను హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలిపిన ఆమె “New year, new script, new beginning… sab new new” అంటూ క్యాప్షన్ రాసి, పెన్సిల్‌తో ఏదో రాస్తున్న ఎమోజీని జత చేసింది. ‘న్యూ బిగినింగ్’ అన్న మాట చూసిన అభిమానులు పెళ్లి గురించేనని భావించారు. కానీ అది కొత్త సినిమా స్క్రిప్ట్‌కు సంబంధించినదని అర్థమవడంతో.. ఆమెకు కంగ్రాట్స్ చెప్పడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో ఈ పోస్ట్ వెనుక భారీ ప్రాజెక్ట్ ఉందన్న అనుమానాలు కూడా తెరపైకి వచ్చాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘AA-24’ సినిమాలో దీపికా పదుకొణె, జాన్వీ కపూర్‌తో పాటు మృణాల్ ఠాకూర్ కూడా నటించబోతుందన్న ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మృణాల్ ఇచ్చిన న్యూ ప్రాజెక్ట్ హింట్.. ఐకాన్ స్టార్ మూవీకి సంబంధించినదే అని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.
Read More..
లక్కీ చాన్స్ కొట్టేసిన బేబమ్మ.. భారీ ప్రాజెక్ట్‌లో స్టార్ హీరో కూతురు రోల్..






