లక్కీ చాన్స్ కొట్టేసిన బేబమ్మ.. భారీ ప్రాజెక్ట్‌లో స్టార్ హీరో కూతురు రోల్..

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-21 03:22:40  IST  )

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ‘మన శంకర వరప్రసాద్ గారు’(Mana Shankara Vara Prasad Garu) మూవీతో భారీ విజయాన్ని అందుకున్నారు.

లక్కీ చాన్స్ కొట్టేసిన బేబమ్మ.. భారీ ప్రాజెక్ట్‌లో స్టార్ హీరో కూతురు రోల్..
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ‘మన శంకర వరప్రసాద్ గారు’(Mana Shankara Vara Prasad Garu) మూవీతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా.. విడుదలైన ఈ చిత్రం ఏకంగా రూ. 300 కోట్ల గ్రాస్‌తో దూసుకెళ్తోంది. అంతేకాకుండా అత్యంత వేగంగా రూ. 300 కోట్ల క్లబ్‌లో చేరిన ప్రాంతీయ సినిమాగా నిలిచింది. ఈ ఘన విజయం తర్వాత చిరంజీవి తదుపరి సినిమాలపై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి. ఆ జాబితాలో ముందుగా వినిపిస్తున్న ప్రాజెక్ట్.. దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో రాబోతున్న ‘మెగా–158’. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్‌బస్టర్ కావడంతో.. ఈ కొత్త సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలకు ముందే ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్స్ నెట్టింట వైరల్ అవుతూ హైప్‌ను పెంచుతున్నాయి.

ఇదిలా ఉండగా, తాజాగా ‘మెగా–158’పై ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో యంగ్ హీరోయిన్ కృతి శెట్టి(Krithi Shetty), క్రేజీ బ్యూటీ అనస్వర రాజన్ కీలక పాత్రల్లో నటించనున్నట్లు టాక్. అదీ చిరంజీవి కూతుళ్లుగా వీరిద్దరూ కనిపించబోతున్నారన్న ప్రచారం అభిమానుల్లో ఆసక్తిని రెట్టింపు చేసింది. వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న కృతి శెట్టికి ఈ అవకాశం పెద్ద బ్రేక్‌గా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ తాజా వార్తతో ‘మెగా–158’పై బజ్ ఒక్కసారిగా పెరిగింది. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించనుండగా.. మార్చి నెలలో షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని బలమైన ఎమోషన్, ఫ్యామిలీ సెంటిమెంట్‌తో పాటు పక్కా మాస్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

Read More..

న్యూ బిగినింగ్ అంటూ మృణాల్ షాకింగ్ పోస్ట్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు

Next Story