- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ వచ్చిన తొలి పదేళ్లలో సమస్యలు తీరలే.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తొలి పదేళ్లలో మన సమస్యలు తీరలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తొలి పదేళ్లలో మన సమస్యలు తీరలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ నల్లగొండ పట్టణంలోని బొట్టుగూడలో ‘కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్’ ఆధ్వర్యంలో రూ. 8 కోట్ల వ్యయంతో నిర్మించిన పాఠశాలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ (Badugu Chandrashekar)తో పాటు ఎస్పీ శరత్ చంద్ర పవార్ (Sharath Chandra Pawar), స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. సరైన విద్య అందితేనే పేదల సమస్యలు తొలుగుతాయని అన్నారు. విద్యపై ప్రభుత్వం ఏటా వేల కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. నల్లగొండలోని బొట్టుగూడ పాఠశాలను ఒక మోడల్ స్కూల్‌గా తీర్చిదిద్దుతామని అన్నారు. బొట్టుగూడ స్కూల్ వంటి ప్రభుత్వ పాఠశాల దేశం మొత్తంలో ఎక్కడా లేదని, మరెక్కడా కనిపించదని పేర్కొన్నారు. విద్యార్థుల అభ్యున్నతి కోసం కంప్యూటర్లు, డిజిటల్ బోర్డులు, క్రీడా సదుపాయాలు కల్పించామని చెప్పారు. మన విద్యార్థులకు మార్కులు బాగా వస్తున్నా.. ఉద్యోగాల సమయంలో అవసరమైన నైపుణ్యాలు (Skills) ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విషయంపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
శ్రీ చైతన్య, నారాయణ సంస్థలు దొంగలు..
ఇక స్కూళ్లలో అడ్మీషన్ల సీజన్ వస్తే తనకు భయం వేస్తుందని.. శ్రీచైతన్య, నారాయణ సంస్థలు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తూ దొంగలుగా తయారు అయ్యారని కామెంట్ చేశారు. తన దగ్గరకు రికమెండేషన్ కోసం వచ్చిన వారికి రూ.3 లక్షల ఫీజు చెప్పి.. రూ.2లక్షలకు తగ్గిస్తున్నారని, అసలు ఫీజు రూ.2 లక్షలేనని అన్నారు. విద్య వ్యాపారం కాదని.. ప్రైవేటు విద్యా సంస్థల్లో కూడా 25 శాతం పేద విద్యార్థులకు సీట్లు ఇవ్వాలని చట్టంలో ఉందన్నారు. కానీ, ఆ చట్టాలకు తూట్లు పొడిచి నేడు కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజుల పేరుతో పేదోళ్ల రక్తాన్ని పీల్చి పిప్పిచేస్తున్నాయని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
నేనే విద్యాశాఖ మంత్రి అయితే.. కార్పొరేట్ విద్యా సంస్థలు బంద్ చేస్తా
ప్రైవేటు స్కూళ్లు, కళాశాల్లో డిగ్రీ, ఇంటర్ చదవిన వాళ్లు టీచర్లుగా పాఠాలు చెబుతున్నారని, అదే ప్రభుత్వం స్కూళ్లలో బీఈడీ చేసి టెట్, డీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు ఉపాధ్యాయులుగా కొనసాగుతున్నారని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యను బట్టీ పట్టించడం వల్ల ఉన్నత చదువులకు వెళ్లిన వాళ్లు ఆత్యహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. తనకు విద్యా శాఖ మంత్రిగా అవకాశం వస్తే.. కార్పొరేట్ విద్యా సంస్థలను బంద్ చేయడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
READ MORE .....






