- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వచ్చే ఎన్నికల్లో ఉత్సాహం ఉంటేనే పోటీ చేస్తా: మంత్రి కోమటిరెడ్డి
నల్లగొండ జిల్లాలోని బొట్టుగూడలో అత్యాధునిక వసతులతో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించారు.

దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ జిల్లాలోని బొట్టుగూడలో అత్యాధునిక వసతులతో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ఉత్సాహం ఉంటేనే పోటీ చేస్తా అని అన్నారు. రాష్ట్రంలో కార్పొరేట్ స్కూల్స్ పేదలను దోచుకుంటున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్యాశాఖ మంత్రిని అయితే అలాంటి స్కూల్స్ అన్నింటినీ మూసేస్తా అని హాట్ కామెంట్స్ చేశారు. ఉపాధ్యాయులు పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సొంత నియోజకవర్గమైన కొడంగల్‌తో సమానంగా నల్లగొండకు నిధులు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. సరైన విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యమని అన్నారు. విద్యకు రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడినా తొలి పదేళ్లలో మన సమస్యలు తీరలేదని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో దాదాపు రూ.200కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని.. కులమతాలకు అతీతంగా విద్యార్థులు చదువుకోవాలన్నది తమ ప్రభుత్వ ఆశయమని చెప్పారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పిల్లలను సర్కారు పాఠశాలల్లో చదివించి మార్పు తీసుకురావాలని ఈ సందర్భంగా కోమటిరెడ్డి సూచించారు.
READ MORE ....






