- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతిపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి.. భావోద్వేగ ట్వీట్
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఈ రోజు ఉదయం(28-01-2026) జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ ఘటన భారత దేశ రాజకీయాలను విషాదం లోకి నెట్టింది.

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Deputy CM Ajit Pawar) ఈ రోజు ఉదయం(28-01-2026) జరిగిన విమాన ప్రమాదం (plane crash)లో ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ ఘటన భారత దేశ రాజకీయాలను విషాదం లోకి నెట్టింది. కాగా అజిత్ పవార్ మృతి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి దేశ రాజకీయాలకు, ముఖ్యంగా మహారాష్ట్రకు తీరని లోటని పేర్కొంటూ సంతాపం ప్రకటించారు. ఎక్స్ వేదికగా స్పందించిన మోడీ తన ట్వీట్‌లో "ప్రజల నేత అజిత్ పవార్ అట్టడుగు స్థాయి ప్రజలతో బలమైన సంబంధం కలిగిన గొప్ప ప్రజా నాయకుడు. మహారాష్ట్ర ప్రజల సేవలో ఎల్లప్పుడూ ముందుండే కష్టపడే తత్వం ఉన్న వ్యక్తిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది".
పరిపాలనా విషయాలపై ఆయనకున్న పట్టు, పేద, అణగారిన వర్గాల సాధికారత కోసం ఆయన చూపిన అంకితభావం ఎంతో అభినందనీయం. బారామతిలో జరిగిన విమాన ప్రమాదం తనను ఎంతగానో కలచివేసింది. "ఈ విషాదకర ప్రమాదంలో తమ ప్రియతమ నాయకుడిని, ఆత్మీయులను కోల్పోయిన వారందరికీ నా సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ అంతులేని దుఃఖ సమయంలో బాధిత కుటుంబాలకు భగవంతుడు ధైర్యాన్ని, శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి" అంటూ అజిత్ పవార్ తో ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ.. ప్రధాని మోడీ భావోద్వేగాని తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.
READ MORE .....






