- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రీన్‌లాండ్‌పై ప్రెసిడెంట్ ట్రంప్ పోస్ట్.. సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రోలింగ్
గ్రీన్‌లాండ్ (Green Land)ను అమెరికాలో విలీనం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్న ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (President Donald Trump) తాజాగా సోషల్ మీడియాలో ఓ వింత పోస్ట్ పెట్టి పరువు తీసుకున్నాడు.

దిశ, వెబ్‌డెస్క్: గ్రీన్‌లాండ్ (Green Land)ను అమెరికాలో విలీనం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్న ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (President Donald Trump) తాజాగా సోషల్ మీడియాలో ఓ వింత పోస్ట్ పెట్టి పరువు తీసుకున్నాడు. వైట్‌హౌస్ అధికారిక ఖాతాలో షేర్ చేసిన ఒక AI జనరేటేడ్ ఫొటో ట్రంప్ ఒక పెంగ్విన్‌తో కలిసి గ్రీన్‌లాండ్ మంచు పర్వతాల వైపు నడుస్తున్నట్లుగా ఉంది. ఆ ఫొటోకు కాప్షన్‌గా ‘పెంగ్విన్‌ను హత్తుకోండి’ (Embrace The Penguin) అని పెట్టారు. అయితే, ఈ ఫోటో వైరల్ అయిన కొద్దిసేపటికే నెటిజన్లు ట్రంప్ జియోగ్రాఫికల్ నాలెడ్జ్‌ను ప్రశ్నిస్తూ విమర్శలు ఎక్కుపెట్టారు. గ్రీన్‌లాండ్ ఉత్తరార్ధగోళంలో (Northern Hemisphere) ఉందని అక్కడ అసలు పెంగ్విన్లు ఉండవని, అవి కేవలం దక్షిణార్ధగోళంలో అంటే అంటార్కిటికా ప్రాతంలో మాత్రమే మాత్రమే జీవిస్తాయి ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. గ్రీన్‌లాండ్‌లో అస్సలు లేని జీవులను ఆ దేశ చిహ్నంగా చూపడంపై శాస్త్రవేత్తలు, నెటిజన్లు సెటైర్లు బ్లాస్ట్ చేస్తున్నారు. ‘కనీసం గ్రీన్‌లాండ్‌లో ఏ జంతువులు ఉంటాయో తెలుసుకోకుండానే దాన్ని కొనేస్తారా’ మరికొందరు నెటిజెన్లు ఎద్దేవా చేస్తున్నారు.
కాగా, డొనాల్డ్ ట్రంప్ 2025లో రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి గ్రీన్‌లాండ్‌ను డెన్మార్క్ (Denmark) నుంచి కొనుగోలు చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రష్యా, చైనాల నుంచి ముప్పు పొంచి ఉన్నందున గ్రీన్‌లాండ్ అమెరికాకు రక్షణ కవచంలా ఉంటుందని ట్రంప్ వాదిస్తున్నారు. గ్రీన్‌లాండ్ విషయంలో తనకు సహకరించని ఐరోపా దేశాలపై 25 శాతం సుంకాలు (Tariffs) విధిస్తానని ఆయన ఇటీవలే హెచ్చరికలు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే.
Read More..






