అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాను: 15 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ

by Malleboina Mahesh |   (  Updated:2026-01-24 04:31:12  IST  )

అగ్రరాజ్యం అమెరికాలో ఈ ఏడాది మంచు తుఫాను ఉహించని విధంగా ఉంది. గతంతో పోలిస్తే అనేక రేట్లు పెరిగిన ఈ తుపాను ప్రభావంతో జన జీవనం అస్థవ్యస్థం అయింది.

అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాను: 15 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ
X

దిశ, వెబ్ డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలో ఈ ఏడాది మంచు తుఫాను (snow storm) ఉహించని విధంగా ఉంది. గతంతో పోలిస్తే అనేక రేట్లు పెరిగిన ఈ తుపాను ప్రభావంతో జన జీవనం అస్థవ్యస్థం అయింది. ముఖ్యంగా అమెరికాలో 'ఫెర్న్' మంచు తుఫాను పెను బీభత్సం సృష్టిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా దాదాపు 15 కోట్ల మంది ప్రజలు గడ్డకట్టే చలిలో అల్లాడుతున్నారు. టెక్సాస్ నుంచి న్యూయార్క్ వరకు సుమారు 15 రాష్ట్రాల్లో ప్రభుత్వం ఇప్పటికే అత్యవసర పరిస్థితిని (Emergency) ప్రకటించింది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో పాటు భారీగా మంచు కురుస్తుండటంతో రోడ్లు, భవనాలు మంచు మేటలతో నిండిపోయాయి. రికార్డు స్థాయిలో కురుస్తున్న మంచు వల్ల జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.

ఈ తుపాను ప్రభావం రవాణా వ్యవస్థపై తీవ్రంగా పడింది. భారీ మంచు, ఐస్ కారణంగా దృశ్యమానత (Visibility) తగ్గడంతో ఇప్పటివరకు 1,800లకు పైగా విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు. వేల సంఖ్యలో విమానాలు ఆలస్యంగా నడుస్తుండటం తో ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు. అటు రహదారులపై మంచు గడ్డకట్టడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక చోట్ల విద్యుత్ లైన్లపై మంచు పేరుకుపోయి తీగలు తెగిపోవడంతో, లక్షలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.

ప్రస్తుత పరిస్థితిపై వైట్‌హౌస్ స్పందిస్తూ ప్రజలను అప్రమత్తం చేసింది. సోమవారం వరకు తుఫాను తీవ్రత ఇలాగే కొనసాగే అవకాశం ఉన్నందున, అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది. ముఖ్యంగా గడ్డకట్టే గాలుల వల్ల 'ఫ్రాస్ట్‌బైట్' వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు ఫెమా (FEMA) బృందాలు రంగంలోకి దిగాయి, బాధితుల కోసం ప్రత్యేకంగా షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నారు.

Read More..

గ్రీన్‌లాండ్‌పై ప్రెసిడెంట్ ట్రంప్ పోస్ట్.. సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రోలింగ్

Next Story