మేడారం జాతరకు ముమ్మర ఏర్పాట్లు.. స్పెషల్ బస్సులను ప్రారంభించనున్న మంత్రులు

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-24 04:18:25  IST  )

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ (Sammakka-Saralamma) మహా జాతరకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

మేడారం జాతరకు ముమ్మర ఏర్పాట్లు.. స్పెషల్ బస్సులను ప్రారంభించనున్న మంత్రులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ (Sammakka-Saralamma) మహా జాతరకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రవాణా, రైల్వే శాఖలు భారీ ఏర్పాట్లు చేశాయి. ఈ మేరకు ఇవాళ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Seethakka) మేడారంలో పర్యటించనున్నారు. జాతర కోసం ప్రత్యేకంగా రూపొందించిన TGSRTC బస్సులను మంత్రులు జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా జాతర ఏర్పాట్లను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం మేడారంలో 50 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక తాత్కాలిక బస్టాండ్‌ను నిర్మించింది. ప్రయాణికుల కోసం 50కి పైగా క్యూలైన్లు, తాగునీరు, విశ్రాంతి గదులు, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేశారు. జాతరకు వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని మేడారం నుంచి నిమిషానికి నాలుగు బస్సులు బయలుదేరేలా పకడ్బందీగా షెడ్యూల్‌ను కూడా రూపొందించారు.

‘జనసాధారణ్’ స్సెషల్ ట్రైన్లు

ఇక రైల్వే శాఖ కూడా మేడారం (Medaram) వెళ్లే భక్తుల కోసం శుభవార్త చెప్పింది. ఈ నెల 28 నుంచి 31 వరకు వివిధ ప్రాంతాల నుంచి మేడారానికి వరంగల్ (Warangal), కాజీపేట (Khazipet) మీదుగా జనసాధారణ్ ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. సికింద్రాబాద్, నిజామాబాద్, ఖమ్మం మరియు అదిలాబాద్ వంటి ప్రధాన ప్రాంతాల నుంచి ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఈ ఏడాది జాతరలో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా ఆర్టీసీ సుమారు 4 వేల స్పెషల్ బస్సులను రెడీ చేసింది.

Read More..

మేడారం జాతరలో పరిశుభ్రతకు ప్రాధాన్యం

Next Story