పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ.. దూల తీరిపోతుందంటూ బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-24 04:12:47  IST  )

చార్మింగ్ స్టార్ శర్వానంద్ (Sharwanand)హీరోగా నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రం సంక్రాంతి విన్నర్‌గా నిలిచి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.

పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ.. దూల తీరిపోతుందంటూ బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: చార్మింగ్ స్టార్ శర్వానంద్ (Sharwanand)హీరోగా నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రం సంక్రాంతి విన్నర్‌గా నిలిచి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్‌లో బిగ్ బాస్ ఫేమ్ సిరి హనుమంతు (Siri Hanumanthu)స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ సినిమాలో ఆమె సీనియర్ నటుడు నరేష్‌కు రెండో భార్యగా, హీరో శర్వానంద్‌కు పిన్ని పాత్రలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. 66 ఏళ్ల నరేష్ పక్కన 30 ఏళ్ల సిరి భార్యగా నటించడమే కాకుండా, సినిమా అంతా గర్భిణీగా కనిపించి తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. సిరి చేసిన ఈ సాహసోపేతమైన పాత్రకు ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఒక సక్సెస్ ఈవెంట్‌లో యాంకర్ మంజూష మాట్లాడుతూ.. ‘‘గతేడాది వచ్చిన ‘ఈషా’లోనూ, ఇప్పుడు ‘ నారి నారి నడుమ మురారి’లోనూ నువ్వు ప్రెగ్నెంట్ లేడీగా నటించావు.

ఈ రెండు సినిమాలు హిట్ అయ్యాయి. అంటే నువ్వు గర్భిణీగా కనిపిస్తే సినిమా బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అవ్వాలా?’’ అని సరదాగా ప్రశ్నించింది. దీనికి సిరి నవ్వుతూ.. "ప్రెగ్నెన్సీతో షూటింగ్ చేయాలంటే దూల తీరిపోతుంది’’ అంటూ తన కష్టాన్ని సెటైరికల్‌గా చెప్పడంతో అంతా నవ్వేశారు. తనను నమ్మి పిన్ని పాత్ర ఇచ్చిన దర్శకుడు రామ్ అబ్బరాజుకు కృతజ్ఞతలు తెలుపుతూ, శర్వానంద్‌తో పని చేయడం చాలా హ్యాపీగా ఉందని సిరి వెల్లడించింది. యూట్యూబ్ నుంచి బిగ్ బాస్ వరకు ప్రయాణించిన సిరి, ఇప్పుడు వెండితెరపై కూడా వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తోంది. అయితే పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ లేడీగా కనిపిస్తూ.. ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటోంది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటూ అమ్మడు తన క్రేజ్‌ను పెంచుకుంటోంది. ఇక పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఓ బాబును దత్తత తీసుకుని పెంచుకుంటోంది. అలాగే షార్ట్ ఫిలిమ్స్ నటుడు హనుమంతుతో ప్రేమలో ఉంది. కానీ వీరిద్దరు ఇంకా పెళ్లి చేసుకోలేదు.. కానీ బిడ్డకు తల్లిదండ్రులుగా ఒకే ఇంట్లోనే ఉంటున్నారు.

Read More..

ధనుష్-మృణాల్ పెళ్లి వీడియో వైరల్.. అసలు నిజం తెలిసి షాక్ అవుతున్న ఫ్యాన్స్!

Next Story