- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్రీడల్లో రాజకీయ జోక్యం దురదృష్టకరం.. భారత్-పాక్ మ్యాచ్ బహిష్కరణపై శశి థరూర్
టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను పాకిస్థాన్ బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ స్పందిస్తూ.. తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను పాకిస్థాన్ బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ స్పందిస్తూ.. తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్రీడలను ఈ విధంగా రాజకీయం చేయడం రెండు వైపులా అవమానకరమని ఆయన అసహనానని వ్యక్తం చేశారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమాన్ కోల్‌కతా తరపున ఆడేందుకు కాంట్రాక్ట్ నిరాకరించడం దురదృష్టకరమని, దీనికి ప్రతిస్పందనగా బంగ్లాదేశ్ చేసిన రియాక్షన్ అతిగా ఉన్నప్పటికీ, పాకిస్థాన్ ఇప్పుడు దానికి సంఘీభావం తెలపడం వల్ల పరిస్థితి అదుపు తప్పుతోందని అన్నారు. రాజకీయ విభేదాలు క్రీడా మైదానంలోకి రావడం క్రీడా స్ఫూర్తిని దెబ్బతీస్తుందని ఎంపీ థరూర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఐసీసీ జోక్యం చేసుకోసుకొని.. ముగింపు పలకాలని పిలుపు
ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ ఉన్న క్రికెట్ వంటి ఆట ప్రజలను ఏకం చేసే సాధనంగా ఉండాలి తప్ప, విభజించేలా ఉండకూడదని ఎంపీ శశి థరూర్ పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకొన్న ఈ ఉద్రిక్త పరిస్థితులపై ఐసీసీ (ICC) తక్షణమే స్పందించి, ఒక అత్యవసర వేదికను ఏర్పాటు చేసి సంబంధిత దేశాలతో చర్చలు జరపాలని ఆయన సూచించారు. "ఈ అర్థం లేని గొడవలకు స్వస్తి పలుకుదాం" అని పిలుపునివ్వాల్సిన సమయం ఆసన్నమైందని, ఇలాంటి పరిస్థితులను నిరంతరం కొనసాగించలేమని ఆయన స్పష్టం చేశారు. క్రీడలను రాజకీయాలకు అతీతంగా చూడాలని కోరుతూ, అందరూ కలిసి కూర్చుని ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.






