- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అఖిలపక్ష పార్టీలు జర్నలిస్టుల ఆధ్వర్యంలో ధర్నా..
కృష్ణ మండలంలో థైరాయిడ్ చౌరస్తాలో సోమవారం నమస్తే తెలంగాణ రిపోర్టర్ రాము, జిల్లా ఫోటోగ్రాఫర్ తహేర్ లపై దాడిని ఖండిస్తూ అఖిల నాయకులు చే ధర్నా నిర్వహించారు.

దిశ, మక్తల్: కృష్ణ మండలంలో థైరాయిడ్ చౌరస్తాలో సోమవారం నమస్తే తెలంగాణ రిపోర్టర్ రాము, జిల్లా ఫోటోగ్రాఫర్ తహేర్ లపై దాడిని ఖండిస్తూ అఖిల నాయకులు చే ధర్నా నిర్వహించారు. అక్రమ ఇసుక రవాణాపై జర్నలిస్టు రాసిన కథనాలు రాసినందుకు ఇసుకమాఫియా విలేకరిపై భౌతిక దాడి చేయడాని ఖండిస్తూ వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కృష్ణ పోలీస్ స్టేషన్ గుడెబల్లూర్ పంచాయతీ పరిధిలోని టైరోడ్డు చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, అఖిలపక్ష నాయకులు జిల్లా విలేకర్ల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. పాత్రికేయులపై దాడికి పాల్పడిన దుండగులను మర్డర్ 307 అరెస్టు చేసి వారికి తగిన శిక్ష విధించాలని చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు . గత కొన్ని సంవత్సరాలుగా అక్రమ ఇసుక వ్యాపారం జరుగుతున్న గత పాలకులు ప్రస్తుత పాలకులు రిపోర్టర్ల పైన దాడి చేస్తున్న ఇసుక మాఫియాను అరికట్టడంలో విఫలమయ్యారని సిపిఎం జిల్లా కార్యదర్శి టి నరసింహులు అన్నారు. ఇసుక మాఫీ దాడి చేయడము చాలా సిగ్గుచేటు ఇది ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వ యంత్రాంగం పాలకులు చర్యలు తీసుకోవాలని బిజెపి నాయకులు ఖండించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు.






