- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాయికృష్ణ నివాసానికి సిట్.. తల్లి విజయలక్ష్మి స్టేట్‌మెంట్ రికార్డ్
విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు....

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్(Vijayawada Krishnalanka Police Station)లో గాదె సాయికృష్ణ లాకప్ డెత్(Gade Saikrishna Custodial Death)కు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో సిట్ అధికారులు(SIT Officers) ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం సాయికృష్ణ ఇంటికి వెళ్లారు. తల్లి విజయలక్ష్మి స్టేట్‌మెంట్(Mother Vijayalakshmi Statement)ను రికార్డు చేశారు. సాయికృష్ణ లాకప్ డెత్‌కు కారణాలు ఏంటనే కోణంలో ఆరా తీశారు.
హైకోర్టులో పిటిషన్ వివరాలపైనా ఆరా
హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ వివరాలపై అడిగి తెలుసుకున్నారు.సీఐ నాగరాజు, కృష్ణలంక పోలీసులపై చేసిన ఆరోపణలపై ఆధారాలుంటే ఇవ్వాలని కోరారు. సాయికృష్ణను మార్కాపురం నుంచి తీసుకొచ్చిన టాస్క్ ఫోర్స్ పోలీసుల ప్రమేయంపైనా అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో తనకు తెలిసిన అన్ని వివరాలతో పాటు అనుమానితులపైనా అధికారులకు విజయలక్ష్మి తెలిపారు. దీంతో ఆమె చెప్పిన అన్ని వివరాలను స్టేట్ మెంట్ రూపంలో నమోదు చేసుకుని తదుపరి దర్యాప్తుపై అధికారులు దృష్టి పెట్టారు.






