- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రధాని మోడీ సూచనలు వైఫల్యానికి నిదర్శనం: రాహుల్ గాంధీ
ప్రజలను త్యాగాలు చేయాలని ప్రధాని మోదీ కోరడంపై రాహుల్ గాంధీ స్పందించారు. ఇది ప్రభుత్వ పన్నెండేళ్ల వైఫల్యానికి నిదర్శనమని, దేశాన్ని నడపడం ఇక ప్రధాని వల్ల కాదని ఆయన విమర్శించారు.

దిశ, వెబ్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) తెలంగాణ పర్యటనలో భాగంగా దేశ ప్రజలకు పలు సూచనలు చేసి విషయం తెలిసిందే. ఈ సూచనలపై దేశవ్యాప్తంగా ప్రజలు వివిధ కోణాల్లో చర్చించుకుంటున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (MP Rahul Gandhi) ప్రధాని మోడీ సూచనలు వైఫల్యానికి నిదర్శనమని తీవ్ర విమర్శలు చేశారు. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి పౌరులు కొన్ని త్యాగాలు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ వేదికగా పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. ప్రధాని చేసిన ఈ సూచనలు ఆయన ప్రభుత్వ పన్నెండేళ్ల వైఫల్యానికి నిదర్శనమని రాహుల్ విమర్శించారు.
ఏది కొనాలి, ఎక్కడికి వెళ్ళాలి అనే విషయాలను కూడా ప్రజలకు వివరించాల్సిన దుస్థితికి దేశాన్ని తీసుకొచ్చారని ఆయన మండిపడ్డారు. ప్రధాని పిలుపును కేవలం ఉపదేశాలుగా కాకుండా, ప్రభుత్వ అసమర్థతకు సాక్ష్యాలుగా పరిగణించాలని రాహుల్ పేర్కొన్నారు. ప్రతిసారీ వైఫల్యాల బాధ్యతను ప్రజలపైకి నెట్టి, ప్రభుత్వం జవాబుదారీతనం నుంచి తప్పించుకోవాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. దేశాన్ని నడపడం ఇకపై ప్రస్తుత ప్రధాని వల్ల కాదని, ఆయన అధికారంలో ఉండటం వల్ల దేశ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని (Compromised PM) రాహుల్ తన ట్వీట్‌లో ఘాటుగా విమర్శించారు.






