- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోమనాథ్‌లో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు.. 75వ వార్షికోత్సవంలో ఉద్వేగపూరిత ప్రసంగం
ప్రధాని నరేంద్ర మోదీ సోమనాథ్ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన ఈ వేడుకల్లో ఆయన పాల్గొని, భారత నాగరికత యొక్క శక్తిని కొనియాడారు.

దిశ, వెబ్ డెస్క్: గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలో ఉన్న పవిత్ర క్షేత్రం సోమనాథ్‌లో నేడు (మే 11, 2026) 'సోమనాథ్ అమృతోత్సవాలు' (Somnath Amrut Mahotsav) అత్యంత వైభవంగా జరిగాయి. స్వాతంత్ర్యానంతరం పునర్నిర్మించిన సోమనాథ్ ఆలయ 75వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి 'విశేష మహా పూజ' నిర్వహించడం తో పాటు కుంభాభిషేకం, ఆలయ శిఖరంపై ధ్వజారోహణం చేశారు.
అనంతరం సద్భావన మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోడీ (Prime Minister Modi) ప్రసంగిస్తూ.. ప్రభాస్ పటాన్ పుణ్యభూమి నేడు దైవిక కాంతితో వెలిగిపోతోందని కొనియాడారు. "ఆకాశం నుండి కురుస్తున్న పూల వర్షం, కళాకారుల సంగీత నృత్య ప్రదర్శనలు, వేద మంత్రోచ్ఛారణలు, గర్భాలయంలో నిరంతరం వినిపిస్తున్న శివ పంచాక్షరి జపం.. వీటన్నింటికి తోడు సముద్ర కెరటాల గర్జన వింటుంటే ఈ సృష్టి అంతా కలిసి 'జై సోమనాథ్' అని నినదిస్తున్నట్లు అనిపిస్తోంది" అని ఆయన భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. భారత ఆధ్యాత్మిక శక్తి మరియు సాంస్కృతిక చైతన్యాన్ని ఈ అమృతోత్సవం ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు.






