- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Phone Tapping Case: ఎమ్మెల్సీ తండ్రికి, ఎమ్మెల్యే కొడుకుకు నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండల్ రావు(Kondal Rao)కు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొడుకు సందీప్ రావు(Sandeep Rao)కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. మధ్యాహ్నం ఒంటి గంటకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా, ఇటీవలే ఎమ్మెల్సీ నవీన్ రావును సిట్ అధికారులు రెండోసారి విచారించారు. ఆదివారం(04-01-2026) ఉదయం నుంచీ రాత్రి వరకూ విచారణ సాగింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) అధికారులు ఆయనను ప్రశ్నించారు. 2024 సెప్టెంబర్‌లో 3 గంటలపాటు విచారించిన అధికారులు.. మొన్న దాదాపు 8 గంటలకు పైగానే ప్రశ్నల వర్షం కురిపించారు. కీలక అంశాలు రాబట్టారు. అన్నీ రికార్డు చేసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్‌ఐబీ)లో పనిచేసిన ప్రభాకర్‌రావు బృందంతో సంబంధాలపై ఆరా తీశారు. ముఖ్యంగా బీఆర్ఎస్‌కు ఎలక్టోరల్ బాండ్లు సమకూరిన విషయంలో నవీన్‌రావు పాత్ర ఏంటి, ఆ సొమ్ముతో ఫోన్ అక్రమ ట్యాపింగ్ అంశానికి సంబంధముందా అన్న కోణంలో విచారించారు. అయితే.. తాజాగా నవీన్ రావు తండ్రి కొండల్ రావుకు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొడుకు సందీప్ రావుకు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది.
Read More..






