పొలిటికల్ ఎంట్రీపై పవన్ కల్యాణ్ మాజీ భార్య క్లారిటీ

by Gantepaka Srikanth |   (  Updated:2026-01-19 10:41:23  IST  )

పొలిటికల్ ఎంట్రీపై పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చారు.

పొలిటికల్ ఎంట్రీపై పవన్ కల్యాణ్ మాజీ భార్య క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: పొలిటికల్ ఎంట్రీపై పవన్ కల్యాణ్(Pawan Kalyan) మాజీ భార్య రేణు దేశాయ్(Renu Desai) క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో ఆమె తాజాగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తనకు రాజకీయాలపై ఇంట్రెస్ట్ లేదు. ఎప్పటికీ పాలిటిక్స్‌లోకి రాను. కానీ సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై, మూగ జీవువులను హింసిస్తున్న ఘటనలపై నిత్యం స్పందిస్తూనే ఉంటాను.. మాట్లాడుతూనే ఉంటాను’ అని రేణు దేశాయ్ స్పష్టత ఇచ్చారు. అనంతరం వీధి కుక్కలను నిర్మూలించడానికి తీసుకుంటోన్న చర్యలను ఖండించారు. వీటిని హత్యలుగా అభివర్ణించారు. వాటిని నిర్మూలించడానికి చేపట్టిన చర్యలు అత్యంత అన్యాయమైనవని, మానవత్వం లేనివని అన్నారు. చిన్నపిల్లలను కరుస్తున్నాయనే కారణంతో వీధి కుక్కల పట్ల క్రూరంగా ప్రవర్తించడం సరికాదని అన్నారు. ప్రజా భద్రత పేరుతో జంతువులను లక్ష్యంగా చేసుకోవడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదాలకు కుక్కలను నిందించడం పట్ల రేణు దేశాయ్ అభ్యంతరం తెలిపారు. దయచేసి ఇకనుంచైనా కుక్కలను చంపడం ఆపేయాలని కోరారు.

Read More... మగతనం లేదా.. మగాళ్లు కాదా.. గవర్నమెంట్ ఏం చేస్తుందంటూ రేణు దేశాయ్ ఫైర్

Next Story