మగతనం లేదా.. మగాళ్లు కాదా.. గవర్నమెంట్ ఏం చేస్తుందంటూ రేణు దేశాయ్ ఫైర్

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-19 10:40:17  IST  )

గత కొద్ది కాలంగా రేణు దేశాయ్(Renu Desai) సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులతో వార్తల్లో నిలుస్తోంది.

మగతనం లేదా.. మగాళ్లు కాదా.. గవర్నమెంట్ ఏం చేస్తుందంటూ రేణు దేశాయ్ ఫైర్
X

దిశ, సినిమా: గత కొద్ది కాలంగా రేణు దేశాయ్(Renu Desai) సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులతో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా, ఓ కార్యక్రమంలో పాల్గొన్న రేణు సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘‘ఒక ఏడాదిలో లక్షల మంది దోమ కాటు వల్ల చనిపోతున్నారు. ప్రాణాలకి విలువ లేదా. జీ టీవీలో నేను ఒక ప్రోగ్రాం చేశాను. అందులో ఓ చిన్న బిడ్డ డెంగ్యుతో చనిపోయాడు. ఆ ప్రాణంకి విలువ లేదు కానీ కుక్క కరిస్తేనే ఆ ప్రాణంకి విలువ ఉంటుందా? కుక్కలను ద్వేషించే వారిని అడుగుతున్నా..మీకు మనుషుల ప్రాణాల గురించి మాట్లాడే హక్కు లేదు. కుక్క మీద విరక్తి.. కోపం వల్లనే మాట్లాడుతున్నారు. దేశంలో ఎంతమంది హత్యకు గురవుతున్నారు. చిన్నపిల్లలపై రేపులు జరుగుతున్నాయి. అప్పుడు మీ హుమానిటీ గుర్తు రావడం లేదా? మీ ఇంటి పక్కనే వందమంది ఉంటారు. వాళ్లు ఎంతోమందిని చిన్నారులను రేపు చేసి చంపుతున్నారు.

అప్పుడు మీరు ఏం చేస్తారు ఆ చిన్న పిల్లల కోసం. హెల్మెట్ పెట్టుకోకుండా.. ఎంతోమంది ఆక్సిడెంట్ కారణంగా చనిపోతున్నారు. ఆ మనుషుల ప్రాణాలకు విలువ లేదా. కుక్క కరిస్తే ప్రాణం పోతే.. దానికే విలువ ఉంటుందా? నేను కుక్కల గురించి, మేకల గురించి మాట్లాడటానికి రాలేదు. ఒక రేపిస్ట్ ఒక చిన్న బిడ్డను దారుణంగా రేప్ చేసి చంపేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది మీ మగతనం. ఎందుకు మీరు ఆ రేపిస్టులను చంపట్లేరు. మీకు మగతనం లేదా.. మగాళ్లు కాదా. నేను ఒకరోజు గల్లీలో రాత్రి 12 గంటలకు తిరుగుతాను. అక్కడ నా చుట్టూ 15 కుక్కలు తిరుగుతున్నాయి ఇప్పటికీ వరకు నాకు ఒక కుక్క కూడా కరవలేదు. 2019లో డెంగ్యూ వచ్చింది ఆల్మోస్ట్ చచ్చి బ్రతికాను. అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది. మీ ఇంటి పక్కనే పాట్స్ పెట్టుకుని చెత్త అలానే ఉంచేస్తారు. దాంట్లో లక్ష వైరస్‌లు తిరుగుతుంటాయి’’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది.

Read More... పొలిటికల్ ఎంట్రీపై పవన్ కల్యాణ్ మాజీ భార్య క్లారిటీ

Next Story