విపక్షాలకు మహిళా సాధికారత ఇష్టం లేదు.. పవన్ కళ్యాణ్ సంచలన ట్వీట్

by Malleboina Mahesh |   (  Updated:2026-04-18 08:28:09  IST  )

మహిళా బిల్లును అడ్డుకున్న విపక్షాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం! రాజకీయ ప్రయోజనాల కోసం మహిళా సాధికారతను జాప్యం చేస్తున్నారని విమర్శ.

విపక్షాలకు మహిళా సాధికారత ఇష్టం లేదు.. పవన్ కళ్యాణ్ సంచలన ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్ సభలో వీగిపోయిన విషయం తెలిసిందే. ఈ పరిణామంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. విపక్షాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన తన ట్వీట్ లో "భారత చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం పెంచే చారిత్రాత్మక అవకాశాన్ని విపక్షాలు కావాలనే అడ్డుకున్నాయి. దేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే, మహిళా సాధికారతకు బాటలు వేసే సంస్కరణలకు మద్దతు ఇచ్చే ఉద్దేశం విపక్షాలకు లేదని ఆయన విమర్శించారు. ఈ మేరకు శనివారం ఆయన 'X' (గతంలో ట్విట్టర్) వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు.

రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమా?

మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించడం ద్వారా విపక్షాలు జాతీయ ప్రగతి కంటే తమ రాజకీయ సమీకరణలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాయని పవన్ కళ్యాణ్ ఆక్షేపించారు. "అనేక ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ సంస్కరణకు మద్దతు తెలపడం ద్వారా ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. కానీ విపక్షాలు పరోక్షంగా లింగ సమానత్వాన్ని, కలుపుగోలు పాలనను జాప్యం చేస్తున్నాయి" అని ఆయన పేర్కొన్నారు.

ప్రధాని మోదీ నాయకత్వంపై ప్రశంసలు

ఎన్డీయే (NDA) భాగస్వామిగా.. ఈ కీలక బిల్లును పార్లమెంట్‌ ముందుకు తీసుకువచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దార్శనికతను జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ అభినందించారు. ఈ బిల్లు ఆమోదం పొంది ఉంటే దేశవ్యాప్తంగా లక్షలాది మంది మహిళల జీవితాల్లో అది ఒక గర్వకారణమైన ఘట్టంగా నిలిచేదని ఆయన అభిప్రాయపడ్డారు. విపక్షాలు అడ్డుకున్నప్పటికీ, రాబోయే రోజుల్లో భారత చట్టసభల్లో మహిళలు తమకు దక్కాల్సిన గౌరవప్రదమైన స్థానాన్ని తప్పక దక్కించుకుంటారనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.

బడ్జెట్ సమావేశాలు ముగింపు.. లోక్‌సభ నిరవధిక వాయిదా

Next Story