మన టైమ్ స్టార్ట్ అయింది.. ‘ది రాజాసాబ్’ స్ట్రీమింగ్‌పై అధికారిక ప్రకటన విడుదల

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-31 05:23:03  IST  )

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)హీరోగా, దర్శకుడు మారుతి తెరకెక్కించిన హారర్–ఫాంటసీ మూవీ ‘ది రాజా సాబ్’ (The Raja Saab)కూడా ఒకటి.

మన టైమ్ స్టార్ట్ అయింది.. ‘ది రాజాసాబ్’ స్ట్రీమింగ్‌పై అధికారిక ప్రకటన విడుదల
X

దిశ, సినిమా: ఈ సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన సినిమాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)హీరోగా, దర్శకుడు మారుతి తెరకెక్కించిన హారర్–ఫాంటసీ మూవీ ‘ది రాజా సాబ్’ (The Raja Saab)కూడా ఒకటి. సంక్రాంతి రేస్‌ను ముందుగా ప్రారంభించిన ఈ చిత్రం.. భారీ అంచనాలు క్రియేట్ చేసినప్పటికీ, థియేటర్లలో మాత్రం ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా నెలరోజులకే డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఇప్పటికే ఓటీటీ విడుదలపై పలు వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా.. ఆ వార్తలకు చెక్ పెడుతూ అధికారిక ప్రకటన విడుదల చేసింది ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్. ఈ సినిమా ఫిబ్రవరి 6 నుంచి స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది.

మన టైమ్ స్టార్ట్ అయింది..భారతదేశపు అతిపెద్ద సూపర్ స్టార్ మాయాజాలంలో మునిగిపోవడానికి సిద్ధంగా ఉండండి’’ అనే క్యాప్షన్ జత చేశారు. అయితే ఇక్కడ ఓ ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఈ మూవీ కేవలం తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో మాత్రమే స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. హిందీ వెర్షన్‌పై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ సంగీతం అందించగా.. మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు. థియేటర్లలో ఆశించిన ఫలితం దక్కని ఈ సినిమా.. ఓటీటీలో అయినా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Read More..

‘స్పిరిట్’ సినిమాలో మరో టాలీవుడ్ హీరో.. పోస్ట్‌తో హింట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా

Next Story