- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘స్పిరిట్’ సినిమాలో మరో టాలీవుడ్ హీరో.. పోస్ట్‌తో హింట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా
టాలీవుడ్‌లో తక్కువ సినిమాలతోనే భారీ సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga).

దిశ, సినిమా: టాలీవుడ్‌లో తక్కువ సినిమాలతోనే భారీ సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga). ఇప్పటివరకు కేవలం రెండు సినిమాలే తెరకెక్కించినప్పటికీ.. ఆయన పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. తొలి చిత్రం ‘అర్జున్ రెడ్డి’తో ట్రెండ్ సెట్ చేసిన వంగా.. ఆ మూవీ విజయ్ దేవరకొండ కెరీర్‌ను ఓ మలుపు తిప్పింది. ఆ తర్వాత తెరకెక్కిన ‘యానిమల్’ అయితే బాక్సాఫీస్ వద్ద తుఫాన్ సృష్టించి.. రికార్డుల్ని తిరగరాసింది. ఈ రెండు బ్లాక్‌బస్టర్లతో సందీప్ రెడ్డి వంగా పాన్ ఇండియా దర్శకుడిగా ఎదిగారు. ఈ క్రమంలోనే ఆయనకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో సినిమా చేసే బంపర్ ఛాన్స్ దక్కింది. ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘స్పిరిట్’ (Spirit)ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ (Prabhas)సరసన త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్, వినయ్ ఒబెరాయ్, డాన్ లీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్పీడ్‌లో జరుగుతోంది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్‌ను ఢీ కొట్టడం కోసం గోపీచంద్ విలన్ పాత్రలో నటిస్తున్నాడన్న టాక్ ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారింది. ఈక్రమంలో.. తాజాగా.. ఈ చర్చలకు మరింత బలం చేకూరేలా సందీప్ రెడ్డి వంగా చేసిన ఓ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ‘అర్జున్ రెడ్డి’ షూటింగ్ సమయంలో తీసిన విజయ్ దేవరకొండ ఫొటోను వంగా షేర్ చేయడం గమనార్హం. దానికి ఎలాంటి క్యాప్షన్ ఇవ్వకపోవడంతో.. ‘స్పిరిట్’ సినిమాలో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడన్న హింట్ ఇదేనా? అంటూ ఫ్యాన్స్, నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అనుకోకుండా ఇలా విజయ్ ఫొటోను షేర్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు.. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, గోపీచంద్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.






