Thank You Movie: థాంక్యూ స్పెషల్ ప్రీమియ‌ర్‌ షోస్‌.. ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తున్న చైతు

by Manoj |   (  Updated:2022-07-21 07:58:31  IST  )

Naga Chaitanya's Thank You Movie Special Premiere Show| హీరో నాగ‌చైత‌న్య 'థాంక్యూ' చిత్రం జూలై 22న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ కానుంది. రాశీ ఖ‌న్నా, మాళ‌వికా నాయ‌ర్‌, అవికా గోర్ హీరోయిన్లుగా న‌టించిన సినిమా నైట్ ప్రీమియర్స్ ప్రద‌ర్శించ‌బోతున్నట్లు తెలిపారు మేకర్స్

Naga Chaitanyas Thank You Movie Special Premiere Show
X

దిశ,సినిమా: Naga Chaitanya's Thank You Movie Special Premiere Show| హీరో నాగ‌చైత‌న్య 'థాంక్యూ' చిత్రం జూలై 22న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ కానుంది. రాశీ ఖ‌న్నా, మాళ‌వికా నాయ‌ర్‌, అవికా గోర్ హీరోయిన్లుగా న‌టించిన సినిమా నైట్ ప్రీమియర్స్ ప్రద‌ర్శించ‌బోతున్నట్లు తెలిపారు మేకర్స్. పెయిడ్ ప్రీమియ‌ర్స్ మాదిరిగా కాకుండా బుక్‌మై షో ద్వారా ఈ స్పెష‌ల్ షో టికెట్లను అందుబాటులోకి తీసుకువ‌చ్చారు. రాత్రి 9.30గం. త‌ర్వాత ఈ షోస్ ప్రారంభ‌మ‌వుతాయ‌ని ప్రక‌టించారు.

ఇలా విడుదలకు ఒక‌రోజు ముందుగానే చిత్ర యూనిట్ ప్రేక్షకులకు స్వయంగా ప్రీమియ‌ర్స్ ఏర్పాటు చేయ‌డం టాలీవుడ్‌లో హట్ టాపిక్‌గా మారింది. నెల్లూరులోని ఎస్‌2 సినిమాస్‌, భీమ‌వ‌రంలోని ఏవీజీ సినిమాస్‌, విజ‌య‌వాడ‌లోని క్యాపిట‌ల్ సినిమాస్‌తో పాటు వైజాగ్ జ‌గ‌దాంబ థియేట‌ర్‌, రాజ‌మండ్రి శ్యామ‌ల థియేట‌ర్లలో ఈ స్పెష‌ల్ ప్రీమియ‌ర్ షోస్ ఉంటాయ‌ని చిత్ర యూనిట్ తెలిపింది.

ఇది కూడా చదవండి: 'కార్తికేయ 2' అప్డే‌ట్‌.. ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన నిఖిల్!

Next Story