Karthikeya 2: 'కార్తికేయ 2' అప్డే‌ట్‌.. ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన నిఖిల్!

by Disha Web |
Karthikeya 2 is to be Released On August 12
X

దిశ, వెబ్‌డెస్క్: Karthikeya 2 is to be Released On August 12| టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్, చందూ మొండేటి కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం 'కార్తికేయ-2'. ఇందులో మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే, గతంలో వచ్చిన కార్తికేయ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వస్తోన్న కార్తికేయ-2 కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్‌కు అభిమానుల నుంచి విశేష స్పందన వచ్చింది. అదే విధంగా ఈ మూవీని మొదట జూలై 22న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల అది వాయిదా వేశారు.

తాజాగా మరో కొత్త విడుదల తేదీని ప్రకటించాడు యంగ్ హీరో నిఖిల్. ఆగస్టు 12న ఈ సినిమాను రిలీజ్ చేస్తునట్లు ఓ మోషన్ పోస్టర్‌ను నిఖిల్ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు. ''అయితే ఈసారి కేవలం టాలీవుడ్‌లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుందని'' రాసుకొచ్చాడు. అది చూసిన నెటిజన్లు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఇది కూడా చదవండి: విజయ్ విశ్వరూపం.. 'లైగర్' ట్రైలర్ రిలీజ్ చేసిన మెగాస్టార్

Next Story

Most Viewed