- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెద్ది సినిమాలో హార్ధిక్ పాండ్యాను వాడేసిన బుచ్చిబాబు !
పెద్ది సినిమాలో హార్ధిక్ పాండ్యాను బుచ్చిబాబు వాడేసినట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ గా నటించిన సినిమా పెద్ది. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా మెరిశారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా గురువారం రోజున రిలీజ్ అయింది. బుధవారం రాత్రి ప్రీమియర్లు పడగా...గురువారం ఉదయం నుంచి పెద్ది సినిమా కోసం జనాలు ఎగబడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ హౌస్ ఫుల్ అవుతున్నాయి.
ఈ క్రమంలో ఈ సినిమాలో హార్దిక్ పాండ్యాను దర్శకుడు బుచ్చిబాబు వాడేసాడని సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది. పెద్ది సినిమాలో రామ్ చరణ్ క్రికెట్ ఆడుతూ, బీభత్సం సృష్టిస్తాడు. ఏ క్రికెట్ ప్లేయర్ ఇప్పటి వరకు ఆడని షాట్లను కూడా ఇందులో ఇరగదీస్తాడు చరణ్. అయితే హార్దిక్ పాండ్యా ఓ మ్యాచ్ సందర్భంగా.. వికెట్ కీపర్ వెనకాలకు అదిరిపోయే షాట్ కొడతాడు. భారీ బౌన్సర్ రాగానే.. తెలివిగా కట్ షాట్ ఆడాడు. అచ్చం అలాంటి షాట్ ను పెద్ది సినిమాలో రామ్ చరణ్ చేత ప్రయోగించాడు దర్శకుడు బుచ్చిబాబు. ఈ సీన్ థియేటర్ లో బాగానే పేలింది. దీంతో పాండ్యాను బాగా బుచ్చిబాబు వాడేసాడని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.






