అమెరికా ఒత్తిళ్లకు ఇండియా లొంగదు..పుతిన్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

by velandi.Saikiran |

అమెరికా, ఇండియా మధ్య సంబంధాలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

అమెరికా ఒత్తిళ్లకు ఇండియా లొంగదు..పుతిన్ కీల‌క ప్ర‌క‌ట‌న‌
X

దిశ‌, వెబ్ డెస్క్: అమెరికా, ఇండియా మధ్య సంబంధాలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఒత్తిళ్లకు మోడీ సర్కార్ లొంగబోదని పుతిన్ వెల్లడించారు. రష్యాతో బంధంపై వెనక్కి తగ్గాలని ఇండియాపై వెస్ట్ దేశాలు, ముఖ్యంగా అమెరికా ఒత్తిడి తెచ్చేందుకు విఫలయత్నం చేస్తోందని సీరియస్ అయ్యారు. అయితే ఇది ఇండియా-రష్యా బంధంపై ఎలాంటి ప్రభావం చూపబోదని, ఆ నమ్మకం తనకు ఉందని పుతిన్ వివరించారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇండియా చాలా బలంగా ఉందని, ఆర్థికవృద్ధిలో ప్రపంచంలోనే టాప్ లో నిలిచిందని ప్రశంసల వర్షం కురిపించారు. ఇండియా-రష్యా మధ్య ట్రేడ్ ను 100 బిలియన్ డాలర్లకు పెంచడమే తమ లక్ష్యం అని పుతిన్ స్పష్టం చేశారు.

Next Story