- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. వన్డే సిరీస్ కైవసం చేసుకున్న పాక్
ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ ఇచ్చిన పాక్.. వన్డే సిరీస్ కైవసం చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: ఆస్ట్రేలియా జట్టుకు ఊహించని షాక్ ఇచ్చింది పాకిస్తాన్. ఈ రెండు జట్ల మధ్య 3 వన్డేల సిరీస్ జరగగా... 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. మొదటి వన్డేలో గెలిచిన పాకిస్తాన్, రెండో వన్డేలో ఓడిపోయింది. ఇక గురువారం రోజున ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో తలపడింది. లాహోర్ గడాఫీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి, సిరీస్ కైవసం చేసుకుంది పాక్. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా మొదటి బ్యాటింగ్ చేసి 157 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ లక్ష్యాన్ని 41.5 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ఛేదించింది. దీంతో నాలుగు వికెట్ల తేడాతో గెలిచిన పాకిస్తాన్, వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. ఈ విజయంతో పాక్ కొత్త కెప్టెన్ షాహీన్ అఫ్రిదిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అతని కెప్టెన్సీలోనే సౌతాఫ్రికా, శ్రీలంకపై సిరీస్ లు గెలిచింది పాక్. ఇక ఇప్పుడు ఆస్ట్రేలియాపై సొంత గడ్డపై సిరీస్ కైవసం చేసుకుంది.






