ఎప్పుడో రావాల్సింది.. పద్మ అవార్డుపై మురళీ మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   (  Updated:2026-01-26 12:07:02  IST  )

గణతంత్ర దినోత్సవ వేళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో తనకు పద్మశ్రీ పురస్కారం దక్కడంపై సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మాగంటి మురళీ మోహన్‌ హర్షం వ్యక్తం చేశారు.

ఎప్పుడో రావాల్సింది.. పద్మ అవార్డుపై మురళీ మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: గణతంత్ర దినోత్సవ వేళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో తనకు పద్మశ్రీ పురస్కారం దక్కడంపై సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మాగంటి మురళీ మోహన్‌(Padma Shri Murali Mohan) హర్షం వ్యక్తం చేశారు. ‘‘అందరికీ నమస్కారం. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసిన పద్మ అవార్డు ఆదివారం సాయంత్రం ప్రకటించినప్పటి నుంచి అనేక మంది మిత్రులు, శ్రేయోభిలాషులు ఫోన్ చేశారు. వాళ్లందరితో నా సంతోషాన్ని పంచుకునే అవకాశం లభించింది. ‘మీకు ఎప్పుడో రావాల్సింది.. ఇప్పుడైనా వచ్చింది’ అని అంటుంటే.. లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వచ్చింది అని చెప్పాను. అన్నీ మనం అనుకున్నప్పుడే రావు. ఏదైనా ఎదురు చూపుల తర్వాత దొరికితే దాని విలువ ఎక్కువ. మిత్రులందరికీ నా శుభాకాంక్షలు. ఇంత మంచి అవార్డును ఇచ్చిన ప్రధాని నరేంద్రమోడీకి, ఏపీ సీఎం చంద్రబాబుకి, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి, చలన చిత్ర పరిశ్రమ ప్రముఖులందరికీ కృతజ్జతలు. అవార్డు అందుకున్న తర్వాత వివరంగా ప్రెస్‌మీట్ పెట్టి చెబుతాను. థ్యాంక్యూ’’ అంటూ ఆయన ఓ వీడియో విడుదల చేశారు.

ఆదర్శవంతమైన ప్రయాణం

కాగా, మాగంటి మురళీ మోహన్‌ ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో తనదైన ముద్ర వేశారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా ఎన్నో సందేశాత్మక చిత్రాలను అందించారు. 'జగమే మాయ' చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేసిన మురళీ మోహన్, క్రమశిక్షణ గల నటుడిగా పేరు తెచ్చుకుని 350కి పైగా సినిమాల్లో నటించారు. ఆయన ప్రస్థానం ఎందరికో ఆదర్శం. మురళీ మోహన్ కేవలం హీరోగానే కాకుండా సహాయ నటుడిగా, విలన్‌గా కూడా రాణించి తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు. కేవలం వెండితెరకే పరిమితం కాకుండా బుల్లితెరపై కూడా కీలక పాత్రలు పోషించి ఇంటింటికీ చేరువయ్యారు. రాజకీయాల్లోకి ప్రవేశించి రాజమండ్రి పార్లమెంట్ ఎంపీగా గెలిచారు. మురళీ మోహన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వేలాది మంది పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నారు.

Read More... ‘మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను’.. నటుడు రాజేంద్రప్రసాద్ భావోద్వేగం

Next Story