‘మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను’.. నటుడు రాజేంద్రప్రసాద్ భావోద్వేగం

by Gantepaka Srikanth |   (  Updated:2026-01-26 11:29:42  IST  )

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం పద్మ అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిందే.

‘మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను’.. నటుడు రాజేంద్రప్రసాద్ భావోద్వేగం
X

దిశ, వెబ్‌డెస్క్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం పద్మ అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిందే. తెలుగు దిగ్గజ నటుడు రాజేంద్ర ప్రసాద్‌(Padma Shri Rajendra Prasad)కు పద్మశ్రీతో కేంద్రం సత్కరించింది. తాజాగా రాజేంద్రప్రసాద్ స్పందించారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. ‘కేంద్ర ప్రభుత్వం నాకు 'పద్మశ్రీ' పురస్కారాన్ని ప్రకటించడం నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఈ గౌరవం కేవలం నాకు మాత్రమే దక్కింది అని నేను అనుకోవడం లేదు. ఇది తెలుగు హాస్యానికి, వినోదాన్ని కోరుకునే సామాన్య ప్రేక్షకుడికి దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. నేను ఈ స్థాయిలో నిలబడటానికి, ఈ అవార్డు అందుకోవడానికి ముఖ్య కారణం ప్రేక్షక దేవుళ్లే. 48 ఏళ్లుగా నేను ఏ వేషం వేసినా, ఏ ప్రయోగం చేసినా మీరందించిన ప్రేమే నాకు ఈరోజు ఇంతటి గుర్తింపు తెచ్చింది.

నాలాంటి ఒక నటుడిని, మీ ఇంటి మనిషిలా ఆదరించి, "నటకిరీటి"ని చేసి, ఈ స్థాయికి తీసుకువచ్చింది మీ చప్పట్లే. ఆ ఋణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. నన్ను ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండమని దీవించిన మీ అందరికీ మరోసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను’ అని రాజేంద్ర ప్రసాద్ వీడియోలో పేర్కొన్నారు.

Read More... ఎప్పుడో రావాల్సింది.. పద్మ అవార్డుపై మురళీ మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Next Story