- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దుబాయ్‌లో మంచు విష్ణు కుటుంబం మీదుగా దూసుకు వెళ్లిన మిస్సైల్
ఇరాన్ దుబాయ్ మీద మిసైల్ దాడులు జరుపుతుండగా, టాలీవుడ్ నటుడు మంచు విష్ణు కుటుంబం ఆ దాడుల నుంచి తృటిలో తప్పించుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : దుబాయ్‌లో ఇరాన్ జరిపిన క్షిపణి దాడులు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో టాలీవుడ్ నటుడు మంచు విష్ణు తన కుటుంబంతో కలిసి అక్కడే ఉండటం, వారి మీదుగా క్షిపణి దూసుకెళ్లడంతో.. వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం దుబాయ్ టూర్ లో ఉన్న మంచు విష్ణు, తన భార్య విరానికా, పిల్లలతో కలిసి ఒక విలాసవంతమైన హోటల్‌లో ఉంటున్నారు. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను యూఏఈ రక్షణ వ్యవస్థలు గగనతలంలోనే అడ్డుకుంటున్న సమయంలో, ఒక క్షిపణి వారున్న భవనానికి అత్యంత సమీపం నుండి, వారి కళ్ల ముందే ఆకాశంలో దూసుకెళ్లింది. ఈ భయంకరమైన దృశ్యాన్ని చూసి మంచు విష్ణు కుటుంబం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. ఆ క్షిపణి ప్రయాణించిన వేగానికి, దాని వెనుక వచ్చిన భారీ శబ్దానికి హోటల్ కిటికీలు కూడా వణికిపోయాయని సమాచారం.
ఈ ఘటన జరిగిన వెంటనే మంచు విష్ణు తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. "జీవితంలో ఎప్పుడూ ఇలాంటి భయంకరమైన పరిస్థితిని ఎదుర్కోలేదు, ఇది ఒక పీడకలలా అనిపించింది" అని తన ఆందోళనను పంచుకున్నారు. తన పిల్లలు ఈ శబ్దాలకు తీవ్రంగా భయపడ్డారని, ప్రస్తుతం తామంతా సురక్షిత ప్రాంతంలో ఉన్నామని ఆయన అభిమానులకు తెలియజేశారు.
ఈ వార్త తెలిసిన వెంటనే మంచు మోహన్ బాబు, ఇతర కుటుంబ సభ్యులు, అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు. ప్రస్తుతం దుబాయ్‌లో యుద్ధ వాతావరణం నెలకొన్నందున, వీలైనంత త్వరగా వారిని క్షేమంగా ఇండియాకు తీసుకురావాలని కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. అయితే దుబాయ్ విమానాశ్రయం తాత్కాలికంగా మూసివేయబడటంతో, విమాన రాకపోకలు పునరుద్ధరించబడిన వెంటనే వారు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మంచు విష్ణు కుటుంబం దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతూ సురక్షితంగా ఉన్నారు. వీడియో






