బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాం.. దయచేసి రక్షించండంటూ సోనాల్ చౌహాన్ ఎమోషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2026-03-01 08:18:03  IST  )

ప్రస్తుతం నెలకొన్న యుద్ధ సంక్షోభ పరిస్థితుల్లో నేను దుబాయ్‌లో చిక్కుకుపోయాను. విమాన సర్వీసులు ఆగిపోవడంతో ఇండియాకు ఎలా రావాలో అర్థం కావడం లేదు.

బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాం.. దయచేసి రక్షించండంటూ సోనాల్ చౌహాన్ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: పశ్చిమ ఆసియాలో ఇరాన్ , ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం ఇప్పుడు ప్రపంచాన్నంతటినీ భయాందోళనలకు గురిచేస్తోంది. ఈ యుద్ధ సెగలు కేవలం ఆ రెండు దేశాలకే పరిమితం కాకుండా బహ్రెయిన్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వంటి పొరుగు దేశాలకు కూడా పాకాయి. ఈ నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయులు తీవ్ర భయాందోళనల మధ్య గడుపుతున్నారు. ముఖ్యంగా విమాన సర్వీసులు నిలిచిపోవడంతో వేలాది మంది భారతీయులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. టాలీవుడ్ హీరో మంచు విష్ణుతో పాటు బాలీవుడ్ అందాల నటి సోనాల్ చౌహాన్ (Sonal Chauhan)కూడా దుబాయ్‌లో యద్ధంలో బిక్కుబిక్కుమంటూ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల హాలిడే ట్రిప్ కోసం అక్కడికి వెళ్లిన వీరికి, అకస్మాత్తుగా యుద్ధం మొదలవ్వడంతో తిరుగు ప్రయాణం కష్టతరంగా మారింది.

విమానాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో స్వదేశానికి రావడానికి దారి కనిపించక వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో నటి సోనాల్ చౌహాన్ సోషల్ మీడియా వేదికగా భారత ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోదీని ఆశ్రయించారు. తనను కాపాడాలంటూ ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ‘‘గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోదీ గారు.. ప్రస్తుతం నెలకొన్న యుద్ధ సంక్షోభ పరిస్థితుల్లో నేను దుబాయ్‌లో చిక్కుకుపోయాను. విమాన సర్వీసులు ఆగిపోవడంతో ఇండియాకు ఎలా రావాలో అర్థం కావడం లేదు. ఇక్కడ పరిస్థితులు చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. నేను సురక్షితంగా మళ్ళీ మన దేశానికి చేరుకునేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, నాకు సాయం చేయాలని కోరుతున్నాను. దయచేసి నన్ను రక్షించండి’’ అని ఆమె ఎమోషనల్‌గా వేడుకున్నారు.

సోనాల్ చౌహాన్ ఒక్కరే కాదు, దుబాయ్, ఇతర గల్ఫ్ దేశాల్లో ఉన్న వేలాది మంది భారతీయులు ఇప్పుడు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఎప్పుడు ఏ జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో, కనీసం విమాన ప్రయాణాలు కూడా లేకపోవడంతో వారు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. భారత విదేశాంగ శాఖ ఇప్పటికే అక్కడి పరిస్థితులను గమనిస్తోంది, కానీ యుద్ధ తీవ్రత పెరుగుతుండటంతో రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించడం సవాలుగా మారింది.ఈ ఆపద కాలంలో ప్రభుత్వం త్వరగా స్పందించి, చిక్కుకున్న సినీ ప్రముఖులతో పాటు సామాన్య భారతీయులందరినీ సురక్షితంగా వెనక్కి తీసుకురావాలని అందరూ కోరుకుంటున్నారు.

దుబాయ్‌లో మంచు విష్ణు కుటుంబం మీదుగా దూసుకు వెళ్లిన మిస్సైల్

Next Story