- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'కేటీఆర్‌కు నియ్యత్ ఉందా'.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
సోనియాగాంధీ దయ వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, అలాంటి సోనియా గాంధీ కొడుకు, కూతురుపై డెత్ డిక్లరేషన్ ప్రకటిస్తూ వారి చావు కోరుకుంటావా, కేటీఆర్ నీకు నియ్యత్ ఉందా అంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు.

దిశ, సంగారెడ్డి : సోనియాగాంధీ దయ వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, అలాంటి సోనియా గాంధీ కొడుకు, కూతురుపై డెత్ డిక్లరేషన్ ప్రకటిస్తూ వారి చావు కోరుకుంటావా, కేటీఆర్ నీకు నియ్యత్ ఉందా అంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. సంగారెడ్డి పట్టణంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ బిఎల్ఎలతో సతీమణి నిర్మలతో కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. మాట ఇస్తే మాట నిలబెట్టుకునేది రాహుల్ గాంధీ కుటుంబమని, కానీ మాట ఇస్తే మోసం చేసేది కేసీఆర్ కుటుంబమని ఆయన మండిపడ్డారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో సీఎం రేవంత్ రెడ్డి 562 మందికి గ్రూప్ 1 ఉద్యోగాలు ఇచ్చారనీ, ఇవే కాక వివిధ శాఖల్లో కలిపి మొత్తం 70 వేల ఉద్యోగాలు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ఈ ఉద్యోగాల మాట కేటీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. దీనిపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డితో చర్చకు సిద్దమా అంటూ కేటీఆర్ కు సవాల్ విసిరారు. పదేళ్లు సోనియాగాంధీ దయతో రాజభోగాలు అనుభవించారు కదా, అలాంటిది వారి చావు కోరడం ఇదేనా తెలంగాణ సంస్కృతి అంటూ విమర్శించారు. బుక్కెడు బువ్వ పెడితే పది కాలాల పాటు చల్లగా ఉండమని దీవించేది తెలంగాణ సంస్కృతి అని, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ పిల్లల చావు కోరుకోవడమేనా కేటీఆర్ సంస్కృతి అంటూ ధ్వజమెత్తారు. ఆనాడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఇస్తే సోనియాగాంధీకి తన చర్మం వొలిచి చెప్పులు కుట్టిస్తా అన్నారనీ, తెలంగాణ ఇచ్చాక కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు స్వయంగా వెళ్లి సోనియా కాళ్ళు మొక్కిన సంగతి మర్చిపోయారా అంటూ విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1 పేపర్ లీక్ అయిన తర్వాత అశోక్ నగర్ వెళ్లి నిరుద్యోగులకు సమాధానం చెప్పారా అని ప్రశ్నించారు. విలువలతో కూడిన రాజకీయం గాంధీ కుటుంబంది అయితే, విలువలు లేని రాజకీయాలు కేసీఆర్ కుటుంబానివి అన్నారు.






