గిన్నీస్​ బుక్​ ఆఫ్​ రికార్డ్​ విజేతలను సన్మానించిన ఎమ్మెల్యే

by Batti.Sumithra |

ఇంటర్నేషన్​ తైక్వాండో అకాడమి, విజయ్​ మార్షల్​ ఆర్ట్స్​ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలలో విజేతలుగా నిలిచి గిన్నిస్​ బుక్​ ఆఫ్​ రికార్డులలో స్థానం సాధించిన విజేతలను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆదివారం క్యాంప్​ కార్యాలయంలో సన్మానించారు.

గిన్నీస్​ బుక్​ ఆఫ్​ రికార్డ్​ విజేతలను సన్మానించిన ఎమ్మెల్యే
X

దిశ, కూకట్​పల్లి : ఇంటర్నేషన్​ తైక్వాండో అకాడమి, విజయ్​ మార్షల్​ ఆర్ట్స్​ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలలో విజేతలుగా నిలిచి గిన్నిస్​ బుక్​ ఆఫ్​ రికార్డులలో స్థానం సాధించిన విజేతలను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆదివారం క్యాంప్​ కార్యాలయంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ విద్యతో పాటు మార్షల్​ ఆర్ట్స్​లోనే ప్రావీణ్యం సాధించి గిన్నీస్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో స్థానం పొందడం అభినందనీయమని అన్నారు. ​ఈ సందర్భంగా విజేతలు ఆద్య, యువన్, వెంకట సాయి, యామీ లక్ష్మీ ప్రియ, పార్థు, శివ, వెంకట్, ఆర్. సాయి సాత్విక్, చెర్విష్, జ్ఞానవితలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మార్షల్​ ఆర్ట్స్​ మాస్టర్​ రవితేజ తదితరులు పాల్గొన్నారు.

Next Story