వైసీపీ కీలక నేతపై మంత్రి పేర్ని నాని ఆగ్రహం

by Disha Web Desk 13 |
వైసీపీ కీలక నేతపై మంత్రి పేర్ని నాని ఆగ్రహం
X

దిశ, ఏపీ బ్యూరో : వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడుపై పార్టీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల పశ్చిమగోదారి జిల్లా నర్సాపురం వైసీపీ ఎమ్మెల్యేను గెలిపించి తప్పు చేశానని కొత్తపల్లి సుబ్బారాయుడు చేసిన వ్యాఖ్యలపై పార్టీ నాయకత్వం మండిపడింది. పార్టీలో ఉంటూ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా బహిరంగంగా వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుబట్టింది. అంతేకాదు ఒక నిరసన వేదిక వద్ద చెప్పుతో కొట్టుకోవడం సరికాదని సూచించింది. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే ఉపేక్షించేది లేదని హెచ్చరించిందంటూ వార్తలు వినబడుతున్నాయి.


ఇదిలా ఉంటే మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పశ్చిమగోదావరి జిల్లా ఇన్‌చార్జిమంత్రి పేర్ని నాని మాత్రం కొత్తపల్లి సుబ్బారాయుడు వ్యాఖ్యలపై మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున సుబ్బారాయుడు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. బాధ్యతాయుతమైన పదవులు పనిచేసి.. ప్రజా జీవితంలో సుదీర్ఘకాలం కొనసాగుతున్న వ్యక్తి ఇలా ప్రవర్తించడం సరికాదన్నారు.


ఇలాంటి ప్రవర్తనలు, విమర్శలు ఆయన విలువనే తగ్గిస్తాయే తప్ప మరెలాంటి ఉపయోగం ఉండదన్నారు. నర్సాపురం జిల్లా చేస్తూ.. భీమవరాన్ని హెడ్‌ క్వార్టర్‌గా ప్రకటించింది ప్రభుత్వమని అయితే దానికి ఎమ్మెల్యేకు ఏం సంబంధం అని నిలదీశారు. జిల్లాలోని 7 నియోజకవర్గాలకు భీమవరం అందుబాటులో ఉంటుందని.. అందువల్లే హెడ్ క్వార్టర్‌గా ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మంత్రి పేర్ని నాని వివరణ ఇచ్చారు.



Next Story

Most Viewed