ఉగ్రవాద సంస్థలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నాయి : ధర్మపురి అరవింద్

by Disha Web Desk 23 |
ఉగ్రవాద సంస్థలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నాయి : ధర్మపురి అరవింద్
X

దిశ, మెట్ పల్లి : ఉగ్రవాద సంస్థలు డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నాయని మెట్ పల్లి లో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో ధర్మపురి అరవింద్ అన్నారు.కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అయోధ్య రామాలయానికి తాళం వేసే గతి వస్తుందని అన్నారు. 10 ఏండ్లు కేసీఆర్ గద్దెనెక్కి తెలంగాణ ప్రజలను మోసం చేసాడని, ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కూడా అదే బాటలో అబద్ధాలు చెప్పి ఓట్లు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలు గమనించాల్సిన అవసరం ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఉమ్మడి పౌరసత్వం బిల్లు పెట్టొద్దని ముస్లింలతో కలిసి ధర్నా చేశాడని అన్నారు.

ఈ సారి బీజేపీ ప్రభుత్వం వస్తే యూనిఫాం సివిల్ కోడ్ తీసుకువస్తామని జూన్ 4 తర్వాత చట్టాలు మారిపోతాయని భారతదేశ ఆర్థిక వ్యవస్థ 11 స్థానం నుండి 5 వ స్థానానికి వచ్చిందన్నారు.గల్ఫ్ లో ఉన్న సోదరులు తిరిగి రావాలంటే అవినీతి పాలన పోవాలని అన్నారు. కరోనా టైంలో మన దేశ ప్రజలకే కాకుండా 150 దేశాలకు టీకాలు పంపి అందర్నీ కాపాడిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వానిదని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్, ధోని కెళ్ళ నవీన్,కౌన్సిలర్ చెట్లపల్లి మీనా, సుంకేట విజయ్, బొడ్ల ఆనంద్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed