- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM రేవంత్ రెడ్డికి ఎన్నికల కమిషన్ నోటీసులు
పార్లమెంట్ ఎన్నికలకు మూడ్రోజుల ముందు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘం షాకిచ్చింది. శుక్రవారం షోకాజు నోటీసులు జారీ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికలకు మూడ్రోజుల ముందు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘం షాకిచ్చింది. శుక్రవారం షోకాజు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను వ్యక్తిగతంగా దూషించినందుకు, అసభ్యపదజాలం వాడినందుకు రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘కేసీఆర్ మతి ఉండి మాట్లాడుతుండో.. మందు వేసి మాట్లాడుతుండో తెలియట్లేదు. సోయిలేనోడు, సన్నాసోడు, చవట, దద్దమ్మ, దిక్కుమాలినోడా’ అంటూ కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి రెచ్చిపోయారు. రైతుబంధు సాయం, రైతురుణమఫీ విషయంలో కేసీఆర్, రేవంత్ మధ్య విమర్శలు జరిగాయి. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఇవాళ సీఎంకు ఈసీ నోటీసులు ఇచ్చింది.






