AP News:జోరు వర్షంలో చంద్రబాబు ప్రసంగం..!

by Jakkula Mamatha |
AP News:జోరు వర్షంలో చంద్రబాబు ప్రసంగం..!
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూటమి పార్టీలు ప్రచారంలో జోరు పెంచారు. శనివారం సాయంత్రం వరకు మాత్రమే ప్రచార గడువు ఉండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఈ క్రమంలోనే చంద్రబాబు వర్షంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శుక్రవారం గన్నవరం ప్రజాగళం సభలో ఆయన ప్రసంగిస్తుండగా జోరు వాన మొదలైంది. దానిని లెక్కచేయకుండా తడుస్తూ ప్రసంగాన్ని కొనసాగించారు.గెలుపే లక్ష్యంగా గొడుగులతో ప్రసంగాన్నీ కొనసాగించారు. ఈ క్రమంలోనే అక్కడున్న ప్రజలు సైతం వానలోనే ప్రసంగం విన్నారు దీంతో చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. మిమ్మల్ని చూసి వరుణ దేవుడే భయపడుతున్నారు అన్నారు. గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్న మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుంటా అని చంద్రబాబు తెలిపారు. ఈ క్రమంలో కూటమి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు ఉండి, ఏలూరు, గన్నవరం, మాచర్ల, ఒంగోలు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించిన చంద్రబాబు రేపు మూడు సభల్లో పాల్గొననున్నారు.

Read More..

AP:ఫ్యాన్‌కి ఓటేస్తే మీ మెడకు ఉరేసినట్లే..చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story

Most Viewed