రెండోసారి గెలిపిస్తే గల్ఫ్ వలసలు నివారిస్తా : ధర్మపురి అరవింద్

by Disha Web Desk 11 |
రెండోసారి గెలిపిస్తే గల్ఫ్ వలసలు నివారిస్తా : ధర్మపురి అరవింద్
X

దిశ, ప్రతినిధి, నిజామాబాద్ : గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీ మేరకు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని ప్రకటించి దాని పై ఫోకస్ చేసి ప్రధానిని ఒప్పించి సాధించానని రెండోసారి ఎంపీగా గెలిస్తే గల్ప్ వలసలు నివారిస్తానని బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు. శుక్రవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఎంపీగా పోటీ చేస్తున్న ధర్మపురి అరవింద్ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో తాను ఎంపీగా గెలిస్తే చేసే డెవలప్ మెంట్ పై డాక్యుమెంట్ ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ… ఈసారి ప్రధానంగా నిరుద్యోగంపై నజర్ వేసి వారికి ఉద్యోగాల కల్పన కోసం వృత్తి నైపుణ్య శిక్షణ నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్నారు. గత ఎన్నికల్లో పసుపు బోర్డు పై ఫోకస్ చేసి సాధించామని ఉద్యోగ అవకాశాలు పెంచడం పై దృష్టి పెడతానని అరవింద్ స్పష్టం చేశారు. బీడీ కార్మికుల కోసం ప్రత్యేక హాస్పిటల్ నిర్మిస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయడం లేదని ఆరోపించారు.కొత్త రేషన్ కార్డ్ లు లేక పేదవారు ఇబ్బందులు పడుతు న్నారని అన్నారు. కొత్త రేషన్ కార్డ్ ఇవ్వక పోవడం సిగ్గుచేటు అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, జిల్లా అధ్యక్షులు కులాచారి దినేష్ తదితరులు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed