చంద్రగిరి వైసీపీలో పెను సంచలనం.. మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు సస్పెన్షన్

by srinivas |
చంద్రగిరి వైసీపీలో పెను సంచలనం.. మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు సస్పెన్షన్
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి జిల్లా చంద్రగిరి వైసీపీలో సంచలనం నమోదు అయింది. మంత్రి పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడు, వైసీపీ కీలక నేత ఎంఆర్సీ రెడ్డిని ఆ పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది. ఎన్నికలకు ముందు వరకూ యాక్టివ్‌‌గా ఉన్న ఆయన ఆ తర్వాత పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు అధినేతకు క్రమశిక్షణ కమిటీ నుంచి ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి కేసులో నిందితులను అరెస్ట్ చేసిన వేళ ఎంఆర్సీ రెడ్డి సస్పెండ్ చర్చనీయాంశంగా మారింది.Next Story

Most Viewed