పవన్ కల్యాణ్ రీమేక్‌తో అఖీరా ఇండస్ట్రీ ఎంట్రీ.. సీన్ చిత్రీకరణ కూడా జరిగినట్లుందే (వీడియో)

by Disha Web Desk 7 |
పవన్ కల్యాణ్ రీమేక్‌తో అఖీరా ఇండస్ట్రీ ఎంట్రీ.. సీన్ చిత్రీకరణ కూడా జరిగినట్లుందే (వీడియో)
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, హీరోయిన్ రేణూ దేశాయ్ ప్రేమ పెళ్లి చేసుకుని.. ఇద్దరు పిల్లలు పుట్టాక విడాకులు తీసుకుని విడిపోయిన సంగతి తెలిసిందే. తర్వాత పవన్ కల్యాణ్ వేరే పెళ్లి చేసుకున్నారు. అలాగే ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఇక వీరి ఇద్దరి పిల్లలు అకీరా నందన్, ఆద్యల బాధ్యత రేణూ దేశాయ్ తీసుకుంది. ఈ మధ్య కాలంలోనే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈమె.. సోషల్ మీడియాలో కూడా జోరు పెంచి పిల్లలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తూ ఉంటోంది. ఈ క్రమంలోనే ఇంతకు ముందుకే అకీరాకు సంబంధించిన ఎన్నో ఫొటోలు, వీడియోలో వైరల్ కావడంతో.. ‘వదిన అకీరాను ఎప్పుడు ఇండస్ట్రీకి పరిచయం చేస్తావు’ అంటూ ఎన్నో కామెంట్లు వచ్చేవి.

ఇదే క్రమంలోనే అకీరాకు సంబంధించిన మరో వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో అకీరా తండ్రికి తగ్గా కొడుకు అనిపించుకునే విధంగా కనిపించాడు. ఎందుకంటే.. పవన్ కల్యాణ్ మార్షన్ ఆర్ట్స్ స్టైల్‌కు స్పెషల్ క్రేజ్ ఉంది. ఇప్పుడు అదే స్టైల్‌లో అకీరా కూడా మార్షల్ ఆర్ట్స్ చేస్తున్న చిన్న క్లిప్ రేణు షేర్ చేసింది. దీంతో ఇప్పుడు ఈ క్లిప్ నెట్టింట వైరల్ కావడంతో.. ‘ఖుషి టైంలో సీన్ చిత్రీకరణలో పవన్ చూసినట్టే ఉంది’, ‘ఈసారి మాత్రం ఇండస్ట్రీ ఎంట్రీ పక్కా’, ‘మార్షల్ ఆర్ట్స్ కూడా వచ్చేసింది కాబట్టి తండ్రి సినిమాతోనే తనయుడు ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చేస్తాడు’ అంటూ రకరకాలుగా స్పందిస్తున్నారు పవన్ కల్యాన్ ఫ్యాన్స్.

Read More...

రాజకీయాలపై మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు.. పిఠాపురంలో ప్రచారంపై క్లారిటీ


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed