ప్రియాంక గాంధీ సభ లో స్వల్ప మార్పులు

by Kalyani |
ప్రియాంక గాంధీ సభ లో స్వల్ప మార్పులు
X

దిశ, కామారెడ్డి : ప్రియాంక గాంధీ సభలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరగాల్సిన ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ లో మార్పులు చోటు చేసుకున్నట్లు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. బహిరంగ సభ కాకుండా దానిని రోడ్ షో, కార్నర్ మీటింగ్ గా మార్చినట్లు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు కామారెడ్డి పట్టణంలోని రైల్వే స్టేషన్, ఇందిరా గాంధీ విగ్రహం నుండి రోడ్ షో ప్రారంభమై సిరిసిల్ల రోడ్ లోని పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి జయప్రకాష్ నారాయణ విగ్రహం, సుభాష్ రోడ్ లో కార్నర్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ రోడ్ షో, కార్నర్ మీటింగ్ లో ప్రియాంక గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు మాట్లాడతారన్నారు.

Next Story

Most Viewed