Minister Malla Reddy ఎమ్మెల్యే స్టిక్కర్ తొలగింపు

by Bhoopathi Nagaiah |   (  Updated:2023-09-01 12:40:05  IST  )

Minister Malla Reddy Responds Over MLA Sticker On Madhava Reddy Car| ఇంటర్నేషనల్ క్యాసినో ఏజెంట్ దాసరి మాధవ రెడ్డి కారుకు ఉన్న మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే కారు స్టిక్కర్‌ను తొలగించారు. బుధవారం బోయిన్ పల్లిలోని మాధవరెడ్డి నివాసంలో ఈడీ దాడులు నిర్వహించిన విషయం

Minister Malla Reddy ఎమ్మెల్యే స్టిక్కర్ తొలగింపు
X

దిశ,బోయిన్ పల్లి : Minister Malla Reddy Responds Over MLA Sticker On Madhava Reddy Car| ఇంటర్నేషనల్ క్యాసినో ఏజెంట్ దాసరి మాధవ రెడ్డి కారుకు ఉన్న మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే కారు స్టిక్కర్‌ను తొలగించారు. బుధవారం బోయిన్ పల్లిలోని మాధవరెడ్డి నివాసంలో ఈడీ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మాధవరెడ్డి వాడుతున్న కారుపై ఉన్న ఎమ్మెల్యే మల్లారెడ్డి స్టిక్కర్ వెలుగు చూసింది. దీంతో మాధవరెడ్డి కారుకు మల్లారెడ్డి ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న విషయమై చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి సీరియస్‌గా తీసుకోవడంతో మాధవరెడ్డి కారుకు స్టిక్కర్ తొలగించారు. మల్లారెడ్డి మాత్రం నా స్టిక్కర్ మార్చ్ 2022 నాటికి గడువు ముగిస్తే తీసి బయట పడేశానని చెప్పుకొచ్చారు. మాధవ రెడ్డికి, క్యాసినోకి, నాకు ఎలాంటి సంబంధం లేదని, ఫేక్ అండ్ జిరాక్స్ తీసి అతికించుకున్నాడే మోనని అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయం తాను కూడ బోయిన్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని మంత్రి మల్లారెడ్డి చెప్పారు.

ఇది కూడా చదవండి: 'టీఆర్ఎస్‌లో తగ్గేదెవరు.. నెగ్గేదెవరు?

Next Story