ఘోర అగ్నిప్రమాదం.. ఒకే ఇంట్లో ఆరుగురు సజీవదహనం

by Malleboina Mahesh |   (  Updated:2026-02-24 06:00:26  IST  )

మీరట్‌లో ఘోర అగ్నిప్రమాదం: లిసాడి గేట్ ప్రాంతంలో ఇల్లు దగ్ధమై ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి. మృతుల్లో మహిళలు, పిల్లలు.

ఘోర అగ్నిప్రమాదం.. ఒకే ఇంట్లో ఆరుగురు సజీవదహనం
X

దిశ, వెబ్ డెస్క్: ఓ ఇంట్లో అగ్నిప్రమాదం (fire hazard) చోటు చేసుకొని ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లిసాడి గేట్ ప్రాంతంలోని ఇక్బాల్ అహ్మద్ అనే వ్యక్తి నివాసంలో రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు ఇంటికి మొత్తం వ్యాపించడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మహిళలు, చిన్న పిల్లలు కూడా ఉండటం స్థానికులను కలచివేసింది. రాత్రి 8:49 గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం అందగానే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కుటుంబ సభ్యులను వెంటనే సివిల్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆరుగురు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మంటలు వేగంగా వ్యాపించడంతో వారు బయటకు రాలేకపోయారని పోలీసులు వెల్లడించారు. ఎస్పీ అవినాష్ పాండే ఆసుపత్రిని సందర్శించి బాధితుల వివరాలను ఆరా తీశారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో లిసాడి గేట్ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు అధికారులు తెలిపారు.

అంబర్‌పేట్‌లో అంతులేని విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య

Next Story