- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంబర్‌పేట్‌లో అంతులేని విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య
హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌లో ఒకే కుటుంబానికి చెందిన రామ్ రాజ్, మాధవి, శశాంక్ ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

దిశ, వెబ్‌డెస్క్: నగరం నడిబొడ్డున అంతులేని విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. మృతులను రామ్ రాజ్ (55), ఆయన భార్య మాధవి (50), కుమారుడు శశాంక్ (24)గా పోలీసులు గుర్తించారు.
వివరాల్లోకి వెళితే.. అంబర్‌పేట్ (Amberpet)లోని తమ నివాసంలో రామరాజు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటి నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు వెంటనే సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న వారు తలుపులు పగులగొట్టి చూడగా.. ముగ్గురు విగతజీవులుగా పడిపోయి కనిపించారు. వారి మృతికి ఆర్థిక ఇబ్బందులా లేక అనారోగ్య సమస్యలా అయి ఉంటాయా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు ఘటనా స్థలాన్ని అంబర్‌పేట్ పోలీసులు క్లూస్ టీమ్ (Clues Team)తో రంగంలోకి దింపి ప్రాథమిక ఆధారాలను సేకరించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.
ఘోర అగ్నిప్రమాదం.. ఒకే ఇంట్లో ఆరుగురు సజీవదహనం
- Tags
- Hyderabad
- Amberpet
- Triple Suicide
- Crime News
- Hyderabad Crime
- Amberpet Suicide Case
- Ram Raj
- Madhavi
- Shashank
- Tragic Incident
- Family Suicide
- Police Investigation
- Local News Hyderabad
- Breaking News Telugu States
- Osmania Hospital
- Post-mortem
- Mental Health Awareness
- Suicide Prevention
- Crime Scene Investigation
- Amberpet Police






