భారీ ఎన్‌కౌంటర్.. 9 మంది మావోయిస్టులు మృతి?

by Malleboina Mahesh |   (  Updated:2026-02-06 08:06:03  IST  )

ఈ రోజు ఉదయం ఛత్తీస్‌గఢ్-మహారాష్ట్ర సరిహద్దులోని అత్యంత దట్టమైన అబూజ్‌మడ్ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలకు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో భద్రతా దళాలకు.. మావోయిస్టులు ఎదురుపడ్డారు

భారీ ఎన్‌కౌంటర్.. 9 మంది మావోయిస్టులు మృతి?
X

దిశ, వెబ్ డెస్క్: ఆపరేషన్ కగార్ వేగంగా కొనసాగుతూనే ఉంది. 2026 మార్చి నెలతో మావోయిస్టుల అంతమే లక్ష్యం గా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం ఛత్తీస్‌గఢ్-మహారాష్ట్ర సరిహద్దులోని అత్యంత దట్టమైన పొదెవాడ అటవీ (Podewada Forest Area)లో భద్రతా దళాలకు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో భద్రతా దళాలకు.. మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో ఇరువురి మధ్య భీకర ఎదురుకాల్పులు (counter fire) జరిగాయి. ఈ ఆపరేషన్‌లో తొమ్మిది మంది మావోయిస్టులు మరణించినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. గత రెండు రోజులుగా నారాయణ్‌పూర్, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతాల్లో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో మావోయిస్టులు తారసపడటంతో ఇరువర్గాల మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి.

ప్రస్తుతానికి ఘటనా స్థలం నుంచి ఐదుగురు మావోయిస్టుల మృతదేహాలను (Bodies of five Maoists) భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్ స్థలంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, విప్లవ సాహిత్యాలను పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా ఒక AK-47 రైఫిల్, ఎస్‌ఎల్‌ఆర్ (SLR) వంటి అత్యాధునిక ఆయుధాలు లభించడం చూస్తుంటే, మరణించిన వారిలో మావోయిస్టు కీలక నేతలు ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ ఆపరేషన్‌లో మహారాష్ట్రకు చెందిన C-60 కమాండో (C-60 Commando) దీపక్ ప్రాణాలు కోల్పోయాడు. గడ్చిరోలి పోలీసుల సమాచారం ప్రకారం..మావోయిస్టుల ఎదురు కాల్పుల్లో గాయపడిన జవాన్‌ను ఎయిర్‌లిఫ్ట్ చేసి ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మరణించారు. మరో జవాన్ గాయపడగా, ఆయన ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ప్రస్తుతం అబూజ్‌మడ్ అటవీ ప్రాంతాన్ని భద్రతా దళాలు "అబూజ్‌మడ్-పొడెవాడ సరిహద్దు ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. పూర్తి స్థాయి శోధన (Combing) ముగిసిన తర్వాత మృతుల సంఖ్యపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

పొదెవాడ అభయారణ్యంలో కాల్పుల మోత.. ముగ్గురు మావోయిస్టులు మృతి

రేపు రాయ్‌పూర్‌కు అమిత్ షా.. మావోయిస్టులపై అంతిమ పంజాకు ప్లాన్!

Next Story