పొదెవాడ అభయారణ్యంలో కాల్పుల మోత.. ముగ్గురు మావోయిస్టులు మృతి

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-06 10:15:50  IST  )

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.

పొదెవాడ అభయారణ్యంలో కాల్పుల మోత.. ముగ్గురు మావోయిస్టులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. జిల్లాలోని పొదెవాడ (Podewada) అభయారణ్యంలో నిన్న రాత్రి ప్రారంభమైన ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే, పొదెవాడ ఫారెస్ట్‌లో మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న పక్కా సమాచారంతో పోలీసులు సీ-60 కమాండోలు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో వారికి మావోయిస్టులు ఎదురుపడటంతో ఇరువర్గాల మధ్య కాల్పులు మొదలయ్యాయి. ఈ భీకర ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టు మృతిచెందారు. అనంతరం స్పాట్‌లో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

స్పాట్‌లోనే పోలీసు అధికారి మృతి..

మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో పోలీసు అధికారి దీపక్ మాదవి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా మరో కమాండో జగో మాదవి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన జవాన్లను వెంటనే చికిత్స నిమిత్తం హుటాహుటాన హెలికాప్టర్‌తో ఎయిర్ లిఫ్ట్ చేసి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం దట్టమైన అడవి కావడంతో అదనపు బలగాలను అక్కడికి తరలించారు. తప్పించుకున్న మిగిలిన మావోయిస్టుల కోసం అడవిని జల్లెడ పడుతున్నారు.

భారీ ఎన్‌కౌంటర్.. 9 మంది మావోయిస్టులు మృతి?

Next Story